Site icon HashtagU Telugu

Shani: ఈ పువ్వును శని దేవుడికి సమర్పిస్తే చాలు అనుగ్రహం పొందొచ్చు!

Shani Devv

Shani Devv

శని దేవుడు తొమ్మిది గ్రహాలలో ఒకడు. సాధారణంగా శని దేవుడిని న్యాయం, కర్మను ఇచ్చేవాడు అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా శని ప్రతి వ్యక్తి కర్మను బట్టి వారికి ఫలాలను ఇస్తాడు అని విశ్వసిస్తూ ఉంటారు. మంచి పనులు చేసే వారికి మంచి ఫలితాలు లభిస్తాయని, అలాగే చెడు పనులు అశుభ ఫలితాలు లభిస్తాయి అని నమ్మకం. కాగా శని దేవుని కోపానికి కేవలం మనుషులు మాత్రమే కాదు దేవదూతలు కూడా భయపడతారు. అందుకే చాలామంది శని దేవుని అనుగ్రహం తమపై ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు.

శని దేవుడికి ప్రీతికరమైన రోజు శనివారం. శనివారం రోజున శని దేవుడిని పూజించడానికి ఉత్తమమైన సమయం సూర్యోదయానికి ముందు అలాగే సూర్యాస్తమయం తరువాత. శనివారం రోజు చే దేవుడికి ఇష్టమైన పువ్వులను సమర్పించడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. మరి శని దేవునికి ఇష్టమైన పువ్వు మరేదో కాదు ముదురు నీలం రంగు పుష్పాలు ముఖ్యంగా అపరాధిత పుష్పాలు చేసే దేవుడికి చాలా ప్రీతికరమైనవి అని చెప్పవచ్చు. శని దేవునికి పూజ చేసే సమయంలో ఈ పుష్పాలను సమర్పించడం వల్ల శని దేవుని అనుగ్రహం కలుగుతుంది.

Shani Dev

ఇందుకోసం శనివారం నాడు శని దేవాలయానికి వెళ్లి శనిముందు ఆవనూనె దీపం వెలిగించి వీలైతే ఆ రోజున దానం చేస్తే శని బాధలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా శని దేవుడు హనుమంతుని భక్తుడిని ఇబ్బంది పెట్టడు అని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి శనివారం హనుమాన్ చాలీసా అని పట్టించడం వల్ల కూడా కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. హనుమాన్ చాలీసా ను పటిస్తూ ఆరోజు ఆంజనేయస్వామిని పూజించడం వల్ల తప్పకుండా శని అనుగ్రహం మనకు కలుగుతుంది.