Hanuman: సమస్యల నుంచి గట్టెక్కాలంటే ఆంజనేయస్వామిని ఇలా పూజించాల్సిందే?

హిందువులు ఎక్కువ శాతం మంది పూజించి దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. హిందూమతంలో మంగళవారం రోజు హనుమంతుడికి అంకితం చేయబడిం

  • Written By:
  • Publish Date - June 30, 2024 / 08:53 AM IST

హిందువులు ఎక్కువ శాతం మంది పూజించి దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. హిందూమతంలో మంగళవారం రోజు హనుమంతుడికి అంకితం చేయబడింది. కొందరు మంగళవారం రోజు పూజలు చేస్తే మరికొందరు శనివారం రోజు పూజలు చేస్తూ ఉంటారు. కానీ మంగళవారం హనుమంతుడిని పూజించడానికి అనుకూలమైన రోజు. ఈ మంగళవారం రోజున ఎవరైతే హనుమంతుడిని మనస్పూర్తిగా పూజిస్తారో వారి మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి అని నమ్మకం. హనుమంతుడిని ఎప్పుడైనా పూజించవచ్చు.

ఆయన అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. హిందూ మతంలో, ఆంజనేయుడిని శివుని అవతారంగా పరిగణిస్తారు. మంగళవారం నాడు అష్టసిద్ధి, నవనిధిని ప్రసాదించే హనుమంతుడితో పాటు మంగళ పుత్రుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి మంగళవారం, శనివారాలను బజరంగబలి రోజులుగా పరిగణిస్తారు. హనుమంతుడిని, కుజ గ్రహాన్ని మంగళవారం నాడు ఆరాధించడం ద్వారా వారి అనుగ్రహం పొందే అవకాశం ఉంది. కాగా హనుమంతుడికి కాషాయ రంగు సింధూరం అంటే చాలా ఇష్టం. అతని ఆశీర్వాదం కోసం, ఆలయానికి వెళ్లి, హనుమాన్ కి సింధూరాన్ని సమర్పించాలి.

ఇలా చేయడం వల్ల శ్రీరామ భక్తుడైన హనుమంతుడు చాలా సంతోషిస్తాడు. సింధూరాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా సర్వ దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా ప్రాణభయం కూడా తొలగిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ సంపద పెరగి తన జీవితంలో డబ్బుకు లోటు ఉండకూడదని కోరుకుంటారు. అందుకోసం మర్రిచెట్టు ఆకును తీసుకుని గంగాజలంతో కడిగి మంగళవారం ఉదయం హనుమంతుడికి నైవేద్యంగా పెడితే ఐశ్వర్యం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో పాటు లక్ష్మి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది.
మంగళవారం ఆంజనేయ పూజలో బ్రహ్మచర్యం పాటించాలి.

ఈ రోజు మీరు ఎవరినీ బాధపెట్టకూడదు. ఈ రోజున మీరు భక్తి , విశ్వాసంతో హనుమాన్ చాలీసాను ఏడుసార్లు పఠించాలి. ఇలా చేసే ఆంజనేయ స్వామి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. వారి జీవితంలో భయం లేదా దుఃఖం ఉండదు. వారి జీవితంలో ఎక్కువ ఆనందం లభిస్తుంది. శ్రీరాముని సేవలో మునిగి ఉన్న ఆంజనేయుడిని పూజించడం ద్వారా, ఒక వ్యక్తి తన ఉజ్వల భవిష్యత్తు, కుటుంబానికి పూర్తిగా అంకితమై జీవితంలోని అన్ని రంగాలలో విజయాన్ని, ఆనందాన్ని పొందుతాడు. ప్రతిచోటా పురోగతి లభిస్తుది. మంగళవారం నాడు ఆంజనేయుడిని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.