Vastu: దుర్గాదేవికి ఇష్టమైన ఈ పువ్వులతో పూజ చేస్తే…మీ ఇంటిపై ఉన్న నజర్ పరార్ అవుతుంది…!!

దేవుళ్లకు పూలు సమర్పించని పూజ...అసంపూర్ణంగా ఉంటుంది. ఒక్కో దేవుడికి ఒక్కో పూలు ప్రీతికరమైనవిగా ఉంటాయి.

  • Written By:
  • Updated On - October 1, 2022 / 08:10 AM IST

దేవుళ్లకు పువ్వులు సమర్పించని పూజ…అసంపూర్ణంగా ఉంటుంది. ఒక్కో దేవుడికి ఒక్కో పువ్వు ప్రీతికరమైనవిగా ఉంటాయి. నవరాత్రుల్లో దుర్గాదేవి తొమ్మిదిరూపాల్లో కొలువై ఉంటుంది. నవరాత్రులలో దుర్గాదేవితో పాటు, ఈ ముక్కోటి దేవతలను ప్రసన్నం చేసుకుంటారు. ముఖ్యంగా నవరాత్రుల్లో దుర్గాదేవికి ఇష్టమైన పువ్వులతో పూజలు చేస్తే..లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు లక్ష్మీదేవికి ఇష్టమైన కమలం పువ్వుతో పాటు మందార పువ్వును కూడా సమర్పించండి. ఇది చాలా దివ్యమైన పుష్పం. ఎరుపు రంగు మందారను లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల అమ్మవారు ప్రసన్నురాలైతుంది. దుర్గాదేవికి ఎరుపు రంగు చాలా ఇష్టమైంది. అందుకే దుర్గామాతకు ఎర్రమందారం, ఎర్రగులాబీతో పూజలు చేయండి.

లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును ఎప్పుడు సమర్పించాలి?
మంగళ, శుక్రవారాల్లో లక్ష్మీదేవికి మందార పువ్వును సమర్పించాలి. ఈ రెండు రోజుల్లో ఈ పుష్పాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. మీరు డబ్బును పోగొట్టుకున్నట్లయితే దానిని తిరిగి పొందేందుకు దారులు కనిపిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో కొత్త అవకాశాలను పొందుతారు.

పిత్ర దోషాన్ని తొలగిస్తుంది:
నవరాత్రులలో సూర్యునికి నీటిని సమర్పించాలి. ఎర్రమందార పువ్వును కూడా సమర్పించాలి. నిజానికి, పితృ దోషం ఉన్నప్పుడు జాతకంలో సూర్యుడు బలహీనుడు అవుతాడు. అటువంటి పరిస్థితిలో, మీరు సూర్యుడిని బలంగా చేయడానికి ఈ పరిహారం తీసుకోవచ్చు.

మందార పువ్వును బీరువాలో ఉంచండి :
కర్పూరంతో కూడిన మందార పువ్వును మీ భద్రంగా ఉంచుకుంటే, లక్ష్మీదేవి కూడా ఆకర్షిస్తుంది. కర్పూరం, మందార పువ్వు ప్రతికూల శక్తిని సానుకూల శక్తిగా మారుస్తాయి. మీరు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటుంటే నవరాత్రుల్లో ఈ ఉపాయం చేయండి.

మంగళ దోషాన్ని తొలగించడానికి:
జాతకంలో మంగళదోషం ఉన్నట్లయితే లేదా కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే, వివాహం చేసుకోవడంలో సమస్య లేదా వైవాహిక జీవితంలో ఇబ్బందులు తప్పవు. అలాంటి పరిస్థితుల్లో నవరాత్రులలో లక్ష్మీ దేవికి ఎరుపు రంగు దుస్తులను సమర్పించి, మందార పూల దండను సమర్పించినట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది.

నర ద్రుష్టి నుంచి ఇంటిని రక్షించే మార్గాలు :
నవరాత్రి అష్టమి రోజున మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీటి పాత్రలో మందార పువ్వును ఉంచాలి. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీలు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది. ఇంటికి నజర్ నుండి కూడా కాపాడుతుంది.