Lord Shani: స్త్రీలు శని దేవుడికి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?

నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం గురించి మనందరికీ తెలిసిందే. శని దేవుడిని న్యాయానికి ప్రత్యేకగా భావిస్తారు. అంటే మనం చేసే మంచి చెడుపనులను బట్టి మం

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 08:30 PM IST

నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం గురించి మనందరికీ తెలిసిందే. శని దేవుడిని న్యాయానికి ప్రత్యేకగా భావిస్తారు. అంటే మనం చేసే మంచి చెడుపనులను బట్టి మంచి చెడు ఫలితాలను అందిస్తాడు శనీశ్వరుడు. మామూలుగా చాలామంది శని దేవుడి గుడికి వెళ్ళాలి అన్న ఆయనకు పూజించాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. అలా పూజలు చేసే సమయంలోనే కొంతమంది తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా స్త్రీలు శని దేవుడికి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకూడదట. శనికి పూజ చేసేటప్పుడు స్త్రీలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శనిదేవుని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా శని విగ్రహాన్ని తాకకూడదు. శని దేవుడి విగ్రహాన్ని మహిళలు తాకితే వారికి ప్రతికూలమైన ప్రభావం కలుగుతుంది. ఇక శని పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా మహిళలు శని దేవుడి కళ్ళల్లోకి అస్సలు చూడకూడదు. అలా చూస్తే ప్రతికూలమైన ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. శని దేవుని విగ్రహానికి నూనెను సమర్పించటం నిషేధం. కాబట్టి శనిదేవుని విగ్రహానికి మహిళలు ఎప్పుడూ నూనెను సమర్పించకూడదు. కానీ శని దేవుడి ముందు దీపాన్ని పెట్టవచ్చు. లేదంటే ఏదైనా రావి చెట్టు ముందు దీపాన్ని పెట్టవచ్చు. శనివారం స్త్రీలు శనికి సంబంధించిన ఆవనూనె, నల్ల బట్టలు, నల్ల ఉసిరి, నల్ల నువ్వులు వంటి వాటిని దానం చేయడం మంచిది.

ఇది శని దోషాన్ని పోగొడుతుంది. అంతే కాదు శని అనుగ్రహం పొందటానికి మహిళలు శని ఆలయంలో శని చాలీసా చదవడం కూడా చాలా మంచిది. శని చెడును మాత్రమే మంచిని కూడా చేస్తాడు. భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్టైశ్వర్యాలను కూడా ఇస్తాడు. కాబట్టి శని విషయంలో అపోహలు మాని భక్తి శ్రద్ధలతో నియమాలను అనుసరించి శని పూజ చేసి శని దేవుడ్ని ప్రసన్నం చేసుకోవాలి.