Site icon HashtagU Telugu

Spirtual: దేవాలయాలకు వెళ్లే స్త్రీలు వీటిని వెంట తీసుకుని వెళ్లాలో మీకు తెలుసా?

Ca16abd8 E07c 4dbb 9574 33e758b6f001

Ca16abd8 E07c 4dbb 9574 33e758b6f001

మామూలుగా దేవాలయాలకు వెళ్తున్నాము అంటే కొన్ని రకాల వస్తువులు తీసుకుని వెళ్లడం అన్నది సహజం. దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మామూలుగా కొబ్బరికాయ పూలు పండ్లు అగరత్తులు గుర్తుకు వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా స్త్రీలు దేవాలయాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కొన్నింటిని తీసుకొని వెళ్లాలని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆలయాలకు వెళ్ళేటప్పుడు స్త్రీలు ఎప్పుడూ కూడా పద్ధతిగా లంగా వోని చీరలను ధరించి మాత్రమే వెళ్లాలని చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఇష్టం వచ్చిన విధంగా విచిత్ర వస్త్రధారణలో గుళ్లకు వెళ్తున్నారు. అలా కాకుండా పద్ధతిగా చీరలు లేదంటే లంగా వోణీ మాత్రమే ధరించి వెళ్లాలని చెబుతున్నారు. అదేవిధంగా ఆలయానికి వెళ్ళేటప్పుడు మహిళలు తప్పనిసరిగా సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్లాలట. ఆలయంలో ఇచ్చే కుంకుమను బొట్టు కింద విభూదిని బొట్టు పైన పెట్టుకోవాలని చెబుతున్నారు. వినాయకుడి గుడికి వెళ్లే మహిళలు ఆలయానికి వెళ్లేటప్పుడు వారితో పాటుగా కొంచెం గరికను తీసుకుని వెళ్లాలని చెబుతున్నారు.

శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలు తీసుకొని శివుడికి సమర్పించాలని చెబుతున్నారు. విష్ణువు ఆలయాలకు వెళ్లే స్త్రీలు తులసి మాలతో వెళ్లాలట. ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లేవారు వెన్న తీసుకుని వెళ్లాలని చెబుతున్నారు. ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ రంగులు కలిగిన పువ్వులతో పాటు పసుపు కుంకుమను కూడా తీసుకొని వెళ్లాలని పండితులు చెబుతున్నారు. మనం ఏ ఆలయానికి వెళ్తామో ఆ ఆలయంలో ఆ దేవుడికి సంబంధించినవి,ఇష్టమైన వాటిని మనతో పాటు తీసుకుని వెళ్లాలని పండితులు సూచిస్తున్నారు.