Site icon HashtagU Telugu

Lakshmi Devi: సంపద రెట్టింపు అవ్వాలంటే ఇంటి ఇల్లాలు ఈ పనులు చేయాల్సిందే?

Mixcollage 25 Jul 2024 05 29 Pm 7262

Mixcollage 25 Jul 2024 05 29 Pm 7262

మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరాలి అన్న, లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలి అన్న, మన తలరాతలు మారాలి అన్న కూడా ఇవన్నీ ఆ ఇంటి ఇల్లాలి చేతిలో ఉంటాయి. ఇంటి ఇల్లాలు కొన్ని రకాల నియమాలను తూచా తప్పకుండా పాటించడం వల్ల ఎలాంటి కష్టాలు కూడా రావు అని చెబుతున్నారు పండితులు. మరి ఇంటి ఇల్లాలు ఇలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్త్రీలు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేయాలి. పొద్దెకిన తరువాత శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రదేవ తాండవం చేస్తుందట. నిద్రలేచిన వెంటనే నుదుట బొట్టు వుండే విధంగా చూసుకోవాలి.

మొఖం కడుక్కోకుండా ఇంట్లో వంట గదిలోకి, పూజ గదిలోకి ప్రవేశించకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే రాత్రి సమయంలో స్త్రీలు గాజులు , కమ్మలు అసలు తీయకూడదట. కొంతమంది స్త్రీలు ఇతరులకు పూలు అడిగినప్పుడు తలలో పెట్టుకున్న పూలు తీసి ఇస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదట. ఒకరు ధరించిన పూలను ఎట్టి పరిస్థితులలో ఇతరులు ధరించకూడదని చెబుతున్నారు. ఇంట్లో శుభకార్యాలు చేయాలి అనుకుంటే అమావాస్య నుంచి పౌర్ణమికి మధ్యలోనే చేయాలట. ఇంట్లో ఎప్పుడు జుట్టు విరబోసుకుని తిరగకూడదట. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కుడి చేతిని కాకుండా ఎడమ చేతితో మాత్రమే ఇవ్వాళట.

అలాగే ఇంటి ఇల్లాలు రాత్రిపూట అలిగి ఆహారం తినకుండా పడుకోకూడదు. ఎప్పుడైనా సరే జీతం వచ్చిన వెంటనే ఇంట్లో ఉప్పు కొనుగోలు చేయాలట. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని చెబుతున్నారు పండితులు. ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా తన నోటి నుంచి పీడ దరిద్రం శని పీనుగు కష్టం లాంటి పదాలను ఉపయోగించకూడదని చెబుతున్నారు. ఇంటి ఇల్లాలు ఆనందంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందని అలా కాకుండా ఇంటి ఇల్లాలు కోపంగా చికాకుగా కనిపిస్తే ఆ ఇల్లు కూడా అలాగే ఉంటుందని చెబుతున్నారు. ఇంట్లో మగవాళ్లు మంగళవారం, హెయిర్ కటింగ్ చేసుకోకుండా చూసుకునే బాధ్యత ఇంటి ఇల్లాలుకు వుంటుందట. స్త్రీలు నలుపు రంగు వస్తువులను, నలుపు రంగా బట్టలను ఎప్పుడూ ధరించకూడద.

ఇంట్లో భోజనం చేసే ముందు ఒక ముద్ద కాకికి పెట్టాలట. కాకికి పెట్టే ముందు భోజనాన్ని కుక్కకు పెట్టాలని శాస్త్రం చెబుతోంది. ఉప్పు, చింతపండు, మిరపకాయలు ఎవ్వరి చేతికి కూడా ఇవ్వకూడదట. కిందపెట్టి వారినే తీసుకోమని చెప్పాలట. సూర్యాస్తమయం తరువాత ఇంటి ఇల్లాలు తల దువ్వడం లాంటివి చేయకూడదట. ఇలా చేస్తే గనుక లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట. కాలిపై కాలు వేసుకొని, కాళ్లు ఊపుతూ, ఒంటి కాలిపై నిలబడ్డం లాంటివి చేయకూడదట.. ఇలాంటి చర్యలు దరిద్రాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు.