సాధారణంగా అప్పుడప్పుడు మహిళలు తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అయితే మహిళలు చేసే ఆ చిన్న చిన్న తప్పులే కొన్ని కొన్ని సార్లు వారిని విధవ చేయడానికి కూడా కారణాలు అవుతాయి అంటున్నారు పండితులు. మరి మహిళలు ఎలాంటి పనులు చేస్తే విధవలు అవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూర్వం శర్యాతి మహారాజు వుండేవాడు. ఆయనకు 400ల మంది భార్యలు ఉన్నా సంతానం లేదు. ఎన్నో పూజలు చేయగా ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడబిడ్డకు సుకన్యా అని నామకరణం చేశాడు. ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు.
సుకన్యా దేవి మంచి అందగత్తె చిన్నప్పుడే గురువుల దగ్గర మంచి అభ్యాసం చేసింది. సంగీతంతో పాటు నాట్యం అన్నీ నేర్చుకుంది. శర్యాతి మహారాజు సుకన్యా దేవికి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ వుంటే ఒక రోజు ఈ సుకన్యా దేవి ఉద్యానవనంలో ఆడుకోవడానికి వెళ్తుంది. చవన మహర్శి కళ్లు తెరిచి తపస్సు చేసేవాడు. అలా తపస్సు చేస్తూ వుంటే శరీరం చుట్టూ పుట్ట ఏర్పడుతుంది. కళ్లు వింతగా మెరుస్తుండడంతో అప్పుడు చవన మహర్శి రెండు కళ్లనూ పొడిచేస్తుంది. కళ్లల్లోంచి రక్తం వస్తుంది. వెంటనే భయపడి సుకన్యా దేవి అక్కడి నుంచి పారిపోతుంది. చవన మహర్శితో పాటు రాజ్యంలోని అందరికీ మలమూత్ర భంగం ఏర్పడుతుంది.
దీంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆ రాజ్యంలోని రాజు చవన మహర్శి పాదాల మీద పడతాడు. 100 మందిని పెట్టి వారు మీకు సేవలు చేసేలా చేస్తానని మహారాజు అంటాడు. డబ్బులు తీసుకున్నవారు సేవలు చేయరు, నా అనుకున్న వాళ్లు మాత్రమే సేవలు చేస్తారని అంటాడు. నా కూతురుని ఇచ్చి మీకు పెళ్లి చేస్తానని చవన మహర్శి అంటాడు. నా వల్ల చవన మహర్శి కళ్లు పోయింది కాబట్టి నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటానని సుకన్యా దేవి ముందుకు వస్తుంది. అప్పటి నుంచి ఆయనకు ఎన్నో సేవలను ఆమె చేస్తూ వస్తోంది. సుకన్యా దేవిని పెళ్లి చేసుకుంటానని సూర్య దేవుని పుత్రులు అంటారు. నేను చవని మహర్శి భార్యను ఎట్టిపరిస్థితుల్లో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అంటుంది. అలా సుకన్య పురాణాల్లో మహా పతివ్రతగా పేరు గాంచింది.
కొంతమంది స్త్రీలు వచ్చి సుకన్యా దేవిని ప్రశ్నలు అడుగుతారు. నువ్వు చవన మహర్శి అర్ధాంగివి, ఎటువంటి స్త్రీలు తొందరగా విధవ అవుతారని అడుగుతుంది ఎనిమిది పనులు చేసిన వారు త్వరగా విధవలౌతారని అంటుంది. మొదటిది పుడకను స్త్రీలు ఎట్టిపరిస్థితిల్లో తొక్కవద్దు. ఒక వేళ తొక్కినట్లయితే స్త్రీలు జీవితాంతం ఏడుస్తూ బాధలు పడవలసి వస్తుంది.. రెండవది చేతికి ధరించిన గాజులకు కూడా పగలగొట్టరాదు. గాజులను అమ్మవారు స్త్రీలకు ప్రసాదించిన భాగ్యవస్తువు కాబట్టి పగులకొట్టుకోవద్దని చెబుతుంది. మూడోది పళ్ళు తోమకుండా ఏమి తినకూడదు తాగకూడదు. ఇక నాలుగవది ఉదయం సాయంత్రం సమయంలో నిద్ర పోయే వారు జీవితంలో అనేక కష్టాలను అనుభవించాల్సి వస్తుందని చెబుతుంది.
ఐదవది పసుపు కుంకుమ ఉప్పును కాలితో తప్పకూడదని చెబుతుంది. స్త్రీలు భర్తను ఇప్పుడు కూడా ఏక వచనంతో పిలవకూడదు అని చెబుతుంది. అలాగే భర్తకు శాపనార్థాలు పెడితే తొందరగా విధవ అవుతారని చెబుతుంది. అలాగే స్త్రీలు నోటితో దీర్పని అర్పరాదు. స్త్రీ యొక్క నోటి ఎంగిలి అగ్ని దేవుడి పై పడితే ఆ స్త్రీ విధవ అయ్యే పరిస్థితి ఎక్కువగా ఉంటుందని చెబుతుంది. అలాగే మంగళసూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదని చెబుతుంది. ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని సుకన్య దేవి తెలిపింది.