Peacock feathers: శనిదోషం పోవాలంటే నెమలి ఈకతో ఈ విధంగా చేయాల్సిందే?

నెమలి.. ఈ పక్షిని చూసినప్పుడు చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు అయిపోతూ

  • Written By:
  • Publish Date - October 26, 2022 / 09:30 AM IST

నెమలి.. ఈ పక్షిని చూసినప్పుడు చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు అయిపోతూ ఉంటారు. ఆ పక్షిని చూసి ఎంతో ఆనంద పడుతూ ఉంటారు. కాగా హిందూ సంప్రదాయ ప్రకారం నెమలీకలను ఎంతో పవిత్రంగా కూడా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ నెమలిని చంపడం అన్నది చట్టరీత్యా నేరం. అందుకు తగిన జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సిందే. అయితే చాలామంది నెమలి ఈకలను పవిత్రంగా భావిస్తూ పూజ మందిరంలో ఉంచి మరి పూజ చేస్తూ ఉంటారు.

అంతేకాకుండా ఈ నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాగా నెమలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి నెమలి ఈకలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవచ్చు. మరి ముఖ్యంగా పూజ గదిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం ఉంటే నెమలి ఈకను అక్కడి పెట్టి పూజించవచ్చు. అదేవిధంగా శనిదోషం పోవాలంటే.. మూడు నెమలి ఈకలను ఒక నల్ల తాడుతో కట్టి అందులో కొద్దిగా నీరు పోసి, ఆ నీటిని చల్లాలి.

ఇలా రోజూ 21 సార్లు శని స్తోత్రాని చెప్పడం వల్ల ఇలా చేయడం వల్ల శనిదోషం తొలగిపోతుంది. అలాగే నగలు, డబ్బు దాచిపెట్టుకునే ప్రదేశంలో నెమలి ఈకలను ఉంచాలి. నెమలి ఈకను ఇంటి ముందు ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్‌ ఎనర్జీ రాకుండా చేసి,ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలిగి పోయేలా చేస్తుంది. అలాగే కొత్తగా పెళ్లైన జంటలు తమ పడకగదిలో నెమలి ఈకలను ఉంచడం ద్వారా జంటలోని సమస్యలను తొలగించి అన్యోన్యత, ఒకరిపట్ల మరొకరికి అవగాహన పెరుగుతుంది.