Site icon HashtagU Telugu

Lunar Eclipse: ఈ నెలలోనే తొలి చంద్రగ్రహణం..మనపై ప్రభావం ఉంటుందా…?

Lunar Eclispe Imresizer

Lunar Eclispe Imresizer

2022 సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు ఉంటాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, 2022లో ఏప్రిల్ 30న సూర్యగ్రహణం ఏర్పడగా, ఇప్పుడు 2022 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 16న అంటే సూర్యగ్రహణం ఏర్పడిన తర్వాత సరిగ్గా 15 రోజుల తర్వాత ఏర్పడుతోంది. వైశాఖ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది. ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. గ్రహణాల వల్ల అనేక వివిధ రాశుల్లో జన్మించిన వారికి శుభ. అశుభ ప్రభావాలను కలిగి ఉంటాయని అనేది మత విశ్వాసం. అయితే ఈ చంద్రగ్రహణం ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కనిపించనుంది. కాగా భారత్‌లో దీని ప్రభావం పాక్షికంగానే ఉంటుంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 16న వస్తుంది. అదే సమయంలో రెండవ చంద్రగ్రహణం 8 నవంబర్ 2022న ఏర్పడనుంది. భూమి నీడ చంద్రునిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజున సంభవిస్తుంది.

చంద్రగ్రహణం 2022 సమయం తెలుసుకోండి..!
పంచాంగం ప్రకారం, భారతదేశంలో 2022 మొదటి చంద్రగ్రహణం 16 మే 2022 సోమవారం ఉదయం 08:59 నుండి 10:23 వరకు సాగుతుంది. అంటే మన దేశంలో ఈ గ్రహణం కనిపించదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం సూత కాలం భారతదేశంలో చెల్లదు.

నైరుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్. అంటార్కిటికా మొదలైన దేశాల్లో మే 16న చంద్రగ్రహణం పూర్తిగా కనిపిస్తుంది. భారతదేశంలో చంద్రగ్రహణం లేనందున, దాని సూతక కాలం ప్రభావవంతంగా ఉండదు. భారతదేశంలో చంద్రగ్రహణం లేనందున, దాని సూతక కాలం కూడా చెల్లదు. అలాగే, భారతదేశంలో ఈ చంద్రగ్రహణం శుభ లేదా అశుభ ప్రభావం ఉండదు.