Shani Puja: శని పూజ చేసిన తర్వాత స్నానం చెయ్యొచ్చా.. పెద్దలు ఏం చెబుతున్నారంటే?

Shani Puja: దేవుళ్లను మనం కొలిచే ముందు పవిత్రంగా స్నానం చేసుకొని దేవాలయాలకు వెళుతుంటాం. అక్కడ కొలువై ఉన్న దేవుళ్లను పూజించుకొని ఇళ్లకు చేరుకుంటే ఉంటాం.

  • Written By:
  • Publish Date - November 7, 2022 / 06:30 AM IST

Shani Puja: దేవుళ్లను మనం కొలిచే ముందు పవిత్రంగా స్నానం చేసుకొని దేవాలయాలకు వెళుతుంటాం. అక్కడ కొలువై ఉన్న దేవుళ్లను పూజించుకొని ఇళ్లకు చేరుకుంటే ఉంటాం. అయితే మనలో చాలామందికి శని ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి. జీవితంలో అనుకున్న పనులు ఏవీ అవకపోవడం, విజయాలు దక్కకపోవడం లాంటివి శని ప్రభావాలుగా మనం భావిస్తుంటాం.
చాలామంది పండితులు శని దేవుడికి పూజ చేస్తే అతడు శాంతిస్తాడని, దాని వల్ల దోషం తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని సూచిస్తుంటారు. అందుకు గాను రకరకాల దినుసులతో పూజ చేయాలని, ప్రత్యేకమైన పూజా విధానాన్ని అనుసరిస్తుంటారు. అయితే పూజ తంతు మొత్తం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లి స్నానం చేయాలని కొంతమంది పండితులు చెబుతుంటారు. మరికొందరు మాత్రం దీని గురించి పెద్దగా ప్రస్తావించరు. అయితే నిజానికి శని దేవుడికి పూజలు నిర్వహించిన తర్వాత స్నానం చేయాలా? వద్దా? అనేది చాలామందికి తెలియకపోవచ్చు.
వాస్తవానికి శని దేవుడికి పూజలు నిర్వహించిన తర్వాత స్నానం చేయడంలో ఎలాంటి అర్థం లేదని పెద్దలు చెబుతుంటారు. శని స్తోత్రం పఠించినా, శని పూజ చేసినా మంచి జరుగుతుందని.. కానీ స్నానం చేయాలనే నిబంధన ఏమీ లేదని అంటున్నారు. ఇలా చేయడంలో ఎలాంటి అర్థం లేదని చెబుతూనే, శని దేవుడి అనుగ్రహం ఉండకపోవచ్చని కూడా అంటున్నారు.
శని దేవుడు అంటే అపవిత్ర దేవుడు కాదని, ఆయన మన కర్మల ఫలితాలను మనకు ప్రసాదిస్తాడని పెద్దలు చెబుతుంటారు. అంటే ఆయన వల్ల మనకు ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు కానీ మన కర్మల ఫలితాలను మనకు ప్రాప్తింపజేస్తాడు అని అర్థం. కాబట్టి శని పూజ తర్వాత స్నానం చేయడం, నవ గ్రహాల ప్రదక్షిణ తర్వాత కాళ్లు కడుక్కోవడం లాంటి వాటిలో ఎలాంటి అర్థం లేనివి అని పెద్దలు వెల్లడిస్తున్నారు.