Site icon HashtagU Telugu

Pooja Room: పూజగదిలో వీటిని ఉంచితే చాలు ఎలాంటి సమస్యలైనా పరిష్కారం అవ్వాల్సిందే!

Pooja Room

Pooja Room

ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకోవడంతో పాటు రకరకాల పూజలు పరిష్కారాలు దానధర్మాలు వంటివి చేస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం పూజలు వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి చంచలమైనది అని ఒకే చోట స్థిరంగా ఎప్పుడూ ఉండదని పండితులు చెబుతున్నారు. కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలని, లక్ష్మీదేవి ఎవరి వెంట అయితే ఉంటుందో ఆ ఇంట కాసుల వర్షం కురవాల్సిందే అంటున్నారు.

ఇందుకోసం మీ పూజ గదిలో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు. మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. పూజగదిలో కొన్ని రకాల వస్తువులను పెట్టడం మంచిదట. వీటిని ఇంట్లోని పూజ గదిలో ఉంచడం వల్ల చాలా మంచి జరుగుతుందట. అవి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయట. మరి పూజగదిలో ఎలాంటి వస్తువులను పెట్టాలి? అన్న విషయానికి వస్తే.. మీ పూజ గదిలో గంట అనేది ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. పూజ గదిలో గంట పెట్టడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయట. ఆర్థిక బాధలు ఉండవు. సాధారణంగా గంటను అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటారు. కానీ పూజ గదిలోనే గంట ఉండేలా చేసుకోవాలట.

అలాగే ఇంట్లో గంట మోగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఆర్థిక బాధలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే ఇంట్లోని పూజ గదిలో ఉండాల్సిన వస్తువులలో నెమలి ఈకలు కూడా ఒకటి. నెమలి ఈకల్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని నమ్ముతారు. పూజ గదిలో ఉంచితే మరింత మంచిదట. కాబట్టి నెమలి ఈకను మీ పూజగదిలో ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల కూడా ఆర్థిక సమస్యలు తగ్గుతాయట. పూజ గదిలో ఉండాల్సిన వస్తువులలో దీపం కూడా ఒకటి. దీపం అనేది చీకటిని తొలగించి కాంతిని ఇస్తుంది. కాబట్టి పూజ గదిలో దీపాన్ని పెడుతూ ఉండటం వల్ల చాలా మంచిదట. నిత్యదీపారాధన చేయడం చాలా మంచిది. అయితే పూజ గదిలో దీపాన్ని పెట్టినప్పుడు పడమర దిక్కు వైపు పెట్టాలని చెబుతున్నారు. పూజ గదిలో శంఖాన్ని పెట్టినా కూడా సిరి సంపదలు బాగా కలిసి వస్తాయట. అలాగే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందట. అలాగే పూజ గదిలో నీళ్లు నింపిన చెంబు లేదా కలశం పెట్టినా చాలా మంచిది. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి ప్రశాంతంగా ఉండవచ్చని చెబుతున్నారు..