Site icon HashtagU Telugu

Pooja Niyamalu: భర్త లేనటువంటి స్త్రీలు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు.. కుంకుమ ధరించవచ్చా?

Mixcollage 25 Dec 2023 04 56 Pm 1740

Mixcollage 25 Dec 2023 04 56 Pm 1740

హిందూ సాంప్రదాయంలో పూర్వకాలం నుంచే ఎన్నో రకాల ఆచార్య వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను ఇప్పటికీ బాటిస్తూనే ఉన్నారు. కానీ కొన్నింటిని ఎందుకు పాటిస్తున్నాము వాటిని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న విషయం చాలా మందికి తెలియదు. అటువంటి వాటిలో భర్తలు లేని స్త్రీలు పూజలు చేయకూడదు అన్న నియమం ఒకటి. అలాగే భర్తలు చనిపోయిన స్త్రీలు పసుపు కుంకుమ ధరించకూడదని పువ్వులు పెట్టుకోకూడదు అని అంటూ ఉంటారు. మరి ఈ పనులు ఎందుకు చేయకూడదు? ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది.. ఈ విషయాల గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆడవారికి సహజంగానే భక్తి ఎక్కువ. మగవారితో పోలిస్తే పూజ కోసం ఏర్పాట్లు చేయడం దగ్గర నుంచి భగవంతుని ఆరాధించడం ఉపవాసాలు చేయటం పువ్వులు తీసుకురావడం మాలలుగా కట్టడం అనేక పనులు భక్తితో చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరినీ దేవాలయాలకు బలవంతంగానే తీసుకెళ్తూ ఉంటారు. తోటి మహిళలతో కలిసి పుణ్య కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. సేవ చేస్తూ ఉంటారు. అయితే భర్త లేని ఆడవారు ఇలా ప్రతినిత్యం పూజలు, నోములు, వ్రతాలు లాంటివి చేసుకోవచ్చా అనేటువంటి సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది. పెళ్లైన స్త్రీలు భర్తని కోల్పోతే తర్వాత శుభకార్యాలకి పూజలకి దూరంగా ఉండాలని కొందరు అంటూ ఉంటారు.

వితంతువులు పూజలు వ్రతాలకు దూరంగా ఉండటం శాస్త్రాల్లో చెప్పబడిందా అంటే శాస్త్ర ప్రకారం భర్తలేని మహిళలు పూజలు చేయకూడదని ఎక్కడ ఉండదు. భగవంతుని పూజకు ఎలాంటి తప్పుగాని దోషం కానీ లేదని పండితులు చెబుతూ ఉంటారు. అయితే పసుపు, కుంకుమలు ఇవ్వటం కొన్ని రకాల పూజలు అంటే భార్యాభర్తలు ఇద్దరు పీటల మీద కూర్చొని చేసేటువంటి పూజలు తప్ప మిగతా ప్రతి పూజా ప్రతి వ్రతం కూడా భగవంతుని ఆరాధించడంలో భర్త లేని స్త్రీలు పాటించడంలో ఎలాంటి తప్పు ఉండదు. కార్తీక పురాణంలో కూడా ఒక స్త్రీ భర్త గాని తండ్రి గాని మరణించిన తర్వాత కార్తీక స్నానాలు ఆచరించిందని ఏకాదశి వ్రతం చేసిందని విష్ణు పూజ చేసిందని ఆ తర్వాత కావేరి నది స్నానం చేస్తుండగా మరణించి మరుసటి జన్మలో సత్యభామగా జన్మించిందని పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి భర్త లేనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు కార్తీక దీపోత్సవం, కార్తీక దీపోత్సవం, వసంత పంచమి, ఉగాది, వసంత నవరాత్రులు, శ్రీరామనవమి పూజలు ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది అభ్యంతరకరం లేకుండా జరుపుకోవచ్చు. ప్రతినిత్యం భగవంతుని ఆరాధనలో నిమగ్నమై మరుజన్మలో వైధవ్యం లేకుండా సుమంగళిగా ఆశీర్వదించమని భగవంతుని వేడుకోవచ్చు. కాబట్టి శాస్త్రాల్లో గాని మన పురాణాల్లో కాని భర్త లేని స్త్రీలు పూజలు చేయకూడదని ఎక్కడా లేదు.