మాములుగా మనం సందర్భానుసారం బట్టి గృహప్రవేశాలకు,పెళ్లిళ్లకు, అలాగే రకరకాల ఫంక్షన్లకు దేవుడి విగ్రహాలను లేదా దేవుడి ఫోటోలను బహుమతులుగా ఇస్తూ ఉంటాం. ఎక్కువ శాతం మంది దేవుడి ఫోటోలను ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది మాత్రమే దేవుడు విగ్రహాలను బహుమతులుగా ఇస్తూ ఉంటారు. అయితే దేవుడి విగ్రహాలను బహుమతులుగా ఇవ్వవచ్చా, ఇవ్వకూడదా? ఈ విషయం గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుట్టుక సమయంలో ఉన్న గ్రహస్థితులను బట్టి మన జాతకం ఆధారపడి ఉంటుంది. ఒకొక్కరి జాతకంలో ఒక్కో దైవం ప్రభావం ఒక్కోవిధంగా ఉంటుంది.
మనం బహుకరించే దైవ ప్రతిమ తీసుకునే వారి జాతకానికి సరిపడకపోతే ఇబ్బందులు తలెత్తవచ్చు. వారి ఆధ్యాత్మిక ఉన్నతికి ఆటంకాలు కలుగవచ్చట. అలాగే సతానతన ధర్మంలో ప్రతి ఒక దైవానికి ఒక్కో ప్రత్యేక ఆరాధనా విధానాలు ఉంటాయి. ఈ సంప్రదాయాలు తెలియని వారికి దేవుడి ప్రతిమ ఇచ్చినపుడు ఫలితాలు వ్యతిరేకంగా ఉండే ప్రమాదం ఉంటుందట. అలాగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు వెనుకబడి, నకరాత్మక శక్తులను ఆకర్శించవచ్చట. జ్యోతిషంలో ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక శక్తి క్షేత్రం ఉంటుంది. అది వారి జన్మ కుండలి పై ఆధారపడి ఉంటుంది. మనం బహుకరించే దైవ ప్రతిమ వారి శక్తి క్షేత్రాల సంతులనాన్ని ప్రభావితం చెయ్యవచ్చు.
వారి శక్తి క్షేత్రాలతో దైవప్రతిమ శక్తి సరిపడేదిగా లేకపోతే వారి జీవితం అస్థిరం అయ్యే ప్రమాదం ఉంటుందని ఉన్నారు. అదేవిధంగా దైవ ప్రతిమను అందుకున్న తర్వాత వారి శక్తికి దైవశక్తికి మధ్య అంతరం ఉన్నపుడు భావోద్వేగ అలజడికి కారణం కావచ్చట. అలాగే వేదాలు ప్రతీ వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయాణం ప్రత్యేకమైందని చెబుతోంది. బహుమతిగా అందుకున్న దైవ ప్రతిమ ఈ ప్రయాణాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. వారి ఆధ్యాత్మిక దృష్టి కూడా మారిపోవచ్చని చెబుతున్నారు. ఇది ఒక్కోసారి నిర్మాణాత్మకంగా ఉంటే ఒక్కోసారి అందుకు వ్యతిరేకంగానూ ఉండవచ్చట. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక ప్రాధాన్యతలు జీవితంలో చాలా ముఖ్యమైనవట. దైవప్రతిమలు బహుకరించడం వల్ల కర్మ ఫలితాలు తారుమారు కావచ్చు. పుచ్చుకున్న దైవ ప్రతిమ శక్తులు వారి జీవిత మార్గానికి ఆటంకాలు ఏర్పరచవచ్చు. చెడు కర్మలు వారు తెలియకుండా చెయ్యవచ్చు. ఇలా మంచి పనే అని తెలిసీ తెలియక చేసే పనులు జీవితంలో అలజడికి కారణం కావచ్చు. అందుకే పూర్తి అవగాహన లేకుండా దైవ ప్రతిమలు బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.