Site icon HashtagU Telugu

Sravana Masam: శ్రావణ సోమవార వ్రతంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?

Sravana Masam

Sravana Masam

హిందువులు శ్రావణమాసంలో పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. శివుడికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని కోరిన కోరికలు నెరవేరుస్తాడని భక్తుల విశ్వసిస్తూ ఉంటారు. అయితే శివుడికి పూజలు చేయడం మంచిది కానీ పొరపాటున కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా శ్రావణ సోమవార వ్రతంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదట. మరి ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలామంది శ్రావణమాసంలో శివుడిని పూజించేటప్పుడు చాలా మంది మొగిలి పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మొగిలి పూలు సమర్పించడం వల్ల శివునికి కోపం వస్తుందని, ఆయనను అసంతృప్తికి గురి చేస్తుందని చెబుతున్నారు పండితులు. కాబట్టి శివపూజలో మొగిలి పూల వాడకపోవడమే మంచిది. అలాగే శ్రావణ సోమవారం రోజున శివుడిని పూజించేటప్పుడు ప్రజలు చేసే మరో తప్పు ఆయనకు తులసిని సమర్పించడం. ఎట్టి పరిస్థితులలో తులసి ఆకులను శివునికి సమర్పించకూడదు. ఇది శివుని కోపానికి దారి తీస్తుందని పండితులు చెబుతున్నారు. శివుడికి కేడి పువ్వు, తులసి నైవేద్యంతో పాటు కొబ్బరి నీళ్ళు సమర్పించడం నిషేధించబడింది.

శివునికి కొబ్బరి నీళ్లు నైవేద్యంగా పెట్టడం వల్ల శివుని ఎర్రని కన్ను కూడా మీపై పడేలా చేస్తుంది. కావున శివునికి కొబ్బరి నీళ్లు నైవేద్యంగా పెట్టకుండా మంచినీళ్లు సమర్పించడం మంచిది. మీరు శివునికి నీటిని సమర్పించినప్పుడు లేదా జలాభిషేకం చేసినప్పుడు, ఎల్లప్పుడూ కంచు లేదా ఇత్తడి పాత్ర నుండి దానిని సమర్పించాలి. శివునికి ఈ లోహ పాత్ర తప్ప మరే ఇతర లోహ పాత్రతో జలాభిషేకం చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా శ్రావణ మాసంలో శివుడిని పూజించేటప్పుడు పసుపు, కుంకుమ సమర్పించకూడదు. వీలైతే భస్మాన్ని శివునికి సమర్పించవచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే శ్రావణ సోమవారం నాడు పూజించేటప్పుడు శివుడిని మంత్రాలతో పూజించాలి. మంత్రాలతో శివపూజ చేయడం ద్వారా, శివుడు అతి త్వరలో మీ పూజలో చేరతాడట. సోమవారం శివపూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించాలని చెబుతున్నారు.