Shani: మామూలుగా చాలామంది శనీశ్వరుడు పేరు వింటే చాలు భయపడిపోతూ ఉంటారు. ఆయన ఆలయాలకు వెళ్లాలి అన్న పూజలు చేయాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు. కానీ శనీశ్వరుడు అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే చాలు కోట్లలో సంపద కలగడం ఖాయం అని చెబుతున్నారు. అయితే ఎప్పుడు అయినా సరే మనం శనీశ్వరుడిని పిలిచేటప్పుడు శని అని మాత్రమే పిలవకుండా శనీశ్వరుడు అని పూర్తిగా పిలవాలట. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. శివుడిని ఈశ్వరుడు అంటారు. మహేశ్వరుడు అని కూడా అంటారు. అలాగే వేంకటేశ్వర స్వామి వారి పేరులో వెంకట ఈశ్వరుడు అని ఉంది.
ఈశ్వర శబ్దం ఉండటం వల్లే వెంకన్న కలియుగ దైవంగా మారారు. కోరిన కోరికలు నెరవేరుస్తున్నారు. అలాగే శనినామధేయంలోనూ ఈశ్వరుడు, శనీశ్వరుడు అనే శబ్దం రావడంతో శనీశ్వరుడు కూడా శివునిలా, వేంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం. కాబట్టి శనీశ్వరుడంటే భయపడాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి ఈ శ్లోకాన్ని నిత్యం స్మరించాలట. ”నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం” ఈ శ్లోకాన్ని నిత్యం స్మరిస్తూ ఉండాలని చెబుతున్నారు. అయితే ఈ శ్లోకం అర్థం ఏంటి అన్న విషయానికి వస్తే.. నీలాంజనం – అంటే నల్లటి కాటుక రూపంలో ఉన్నవాడని, రవిపుత్రం – అంటే సూర్యుని పుత్రుడని, యమాగ్రజం – అంటే యమునికి సోదరుడని, ఛాయా మార్తాండ సంభూతం – ఛాయాదేవికి, మార్తాండుడికి అంటే సూర్యునికి జన్మించిన శనికి నమస్కరిస్తున్నానని అర్థం.
నవ గ్రహాలను పూజించేటప్పుడు శనీశ్వరుడిని భక్తితో నమస్కరించుకుంటే సరిపోతుందట. ఆయన్ని ఇలా ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయట.
అలాగే శనీశ్వరునికి ప్రీతికరమైన నీలం, నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించాలట. శనీశ్వరునికి ఇష్టమైన చిమ్మిలి నివేదన చేయాలని చెబుతున్నారు.
శివారాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చట. హనుమంతారాధన, అయ్యప్ప స్వామి ఆరాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చునని చెబుతున్నారు. శనీశ్వరుడి ప్రభావంతో ఏర్పడే దోషాలు ఈ ఆరాధనల ద్వారా యోగ ఫలితాలను ఇస్తాయట. శనీశ్వరుడి ప్రభావంతో కొన్ని కష్టాలు కలిగినా, ఆయనను పూజించడం, గౌరవించడం ద్వారా ఆయన అనుగ్రహం లభిస్తుందట. అందుకే శని ప్రభావం రావాలని మనం కోరుకోవాలట. ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని కొద్దిగా పీడించినా దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించి వెళ్తారు. శనీశ్వరుడి ప్రభావం వద్దనుకుంటే, యోగం, ఐశ్వర్యం కూడా వద్దనుకోవాల్సిందే అని శనీశ్వరుడిని చక్కగా నీలిరంగు పుష్పాలతో అలంకరణ చేయించి పూజించడం వల్ల అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు.
Shani: శని ప్రభావం వద్దని అనుకుంటున్నారా.. అయితే అదృష్టాన్ని కాలదన్నుకున్నట్లే!

Lord Shani