Site icon HashtagU Telugu

Tirupathi: తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోకపోవడం వెనుక ఉన్న రీజన్ ఇదే?

Mixcollage 09 Jul 2024 05 09 Pm 3275

Mixcollage 09 Jul 2024 05 09 Pm 3275

మామూలుగా స్త్రీలు దేవాలయాలకు వెళ్ళినప్పుడు పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి జడలో పూలు పెట్టుకొని దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. కొందరు అలాగే వెళితే మరికొందరు అందంగా చక్కటి నిండు ముత్తైదువుల తయారై వెళుతూ ఉంటారు. కానీ స్త్రీలు ఒక ప్రదేశంలో మాత్రం పూలు పెట్టుకోకూడదట. ఆ పుణ్యక్షేత్రం మరేదో కాదు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే. తిరుమల తిరుపతిలో మహిళలు పూలు పెట్టుకోకూడదు అనే నియమం ఉందట. మరి ఆ వివరాల్లోకి వెళితే..

కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తిరుమల గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం లక్షలాదిమంది స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటారు. ఏడాది పొడువునా కూడా పండుగ, పబ్బం అని లేకుండా 365 రోజులు భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు స్వామివారి దర్శనానికి రెండు మూడు రోజుల సమయం కూడా పడుతూ ఉంటుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అనేక ఇతర రాష్ట్రాలతో పాటు వేలాది మంది భక్తులు వస్తుంటారు. కేవలం భారతదేశం నుంచి మాత్రమే దేశ విదేశాల నుండి కూడా భక్తులు తిరుమలకు వస్తుంటారు. గంటలు, రోజుల తరబడి క్యూలో నిలబడి గోవిందా అంటూ లక్ష్మి వల్లభను కొలుస్తుంటారు.

తిరుమలలో ప్రతిరోజూ శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తుంటారు. అందుకే శ్రీ మహా విష్ణువును అలంకార ప్రియుడు అని కూడా అంటారు. శ్రీహరి పుష్ప ప్రియుడని కూడా అంటారు. పురాణాలలో తిరుమలను పూల మంటపం అంటారు. తిరుమల పూల మంటపం కావడంతో శ్రీహరి పుష్పాలంకరణ ప్రియుడు కావడంతో స్వామివారిని నిత్యం టన్నుల కొద్దీ పూలతో అలంకరించి పూజలు చేస్తుంటారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా వందలాది అలంకారాల్లో గోవిందుడు భక్తులను పులకింపజేస్తాడు. తిరుమలలో పూచే ప్రతి పుష్పం శ్రీ మన్న నారాయణునికి అంకితమని ప్రజలు, భక్తులు విశ్వసిస్తారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు పూలను తాకకూడదనే నిబంధనను అమలులోకి తెచ్చింది. ఈ కారణం చేతనే స్వామి వారి దర్శనానికి వచ్చే మహిళలు తలలో పూలు ధరించరు. ఈ విషయం మీరు బాగా గమనిస్తే తిరుమలలో దర్శనానికి వెళ్లి ఏ ఒక్క స్త్రీ కూడా తలలో పువ్వులు ధరించదు.