Coconut: ఆడవాళ్లు కొబ్బరికాయ కొట్టకూడదా.. కొడితే ఏం జరుగుతుందో తెలుసా?

కొబ్బరికాయ లేదా టెంకాయ భారతదేశంలో ఈ కొబ్బరికాయను ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - February 6, 2023 / 06:00 AM IST

కొబ్బరికాయ లేదా టెంకాయ భారతదేశంలో ఈ కొబ్బరికాయను ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. అంతే కాకుండా హిందువులు కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. అందుకే ఎటువంటి శుభకార్య మొదలుపెట్టిన కూడా ముందుగా కొబ్బరికాయను కొట్టి అంతే మంచే జరగాలని కోరుకుంటూ కొబ్బరికాయ కొడుతారు. అయితే ఎక్కువ శాతం మనకు గుళ్ళలో గోపురాలలో అలాగే ఎక్కడైనా గాని టెంకాయలు కొట్టే ప్రదేశంలో మగవరు ఎక్కువగా టెంకాయలను కొడుతూ ఉంటారు. చాలా తక్కువ ప్రదేశంలో మాత్రమే స్త్రీలు టెంకాయలను కొడుతూ ఉంటారు. హిందువులు చాలావరకు స్త్రీలను కాకుండా పురుషులను కొబ్బరికాయ కొట్టమని చెబుతూ ఉంటారు.

కొబ్బరికాయను హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరి నీరు చంద్రుని చిహ్నంగా ఉంది. దానిని దేవునికి సమర్పించడం వల్ల సుఖం, శ్రేయస్సు లభిస్తుంది. అదే సమయంలో ఇది దుఃఖం, బాధలను కూడా తొలగిస్తుంది. స్త్రీలకు కొబ్బరికాయ పగలగొట్టడం ఎందుకు కొట్టకూడదు అన్న విషయానికి వస్తే.. హిందూ మతంలో మహిళలు కొబ్బరికాయలు పగలగొట్టడం నిషేధించబడింది. ఎందుకంటే కొబ్బరి ఒక విత్తనం, స్త్రీలు సంతానానికి కారకులు. వారు ఒకే విత్తనం నుండి సంతానం కలిగి ఉంటారు. అందుకే స్త్రీలు ఎప్పుడూ కొబ్బరికాయను పగలగొట్టరు. మహిళలు కొబ్బరికాయను పగలగొడితే వారి పిల్లల జీవితాల్లో అనేక సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. హిందూ మతంలో కొబ్బరికి అత్యధిక మతపరమైన ప్రాముఖ్యత ఉంది.

పురాణాల ప్రకారం, విష్ణువు, తల్లి లక్ష్మి భూమిపై కొబ్బరి చెట్లను నాటినట్లు చెబుతారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అంటారు. కొబ్బరికాయ విష్ణువు తల్లి లక్ష్మికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి దీనిని చాలా పూజ పాఠాలలో ఉపయోగిస్తారు. అయితే భారతదేశంలో హిందువులు కొన్ని ప్రదేశాలలో మహిళలు కొబ్బరికాయలు కొట్టారు. చాలా తక్కువగా మాత్రమే మహిళలు కొబ్బరికాయలను కొట్టిన మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పురుషులు కొబ్బరికాయను కొట్టడం మంచిది. స్త్రీలో కొబ్బరికాయలు కొట్టడం వల్ల వారి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు.