మామూలుగా భారతీయుల వంటకాలలో పసుపును తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. ఒక్క వంటకాలలో మాత్రమే కాకుండా ఎలాంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా మొదట పసుపుకే మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. పెళ్లిళ్లు, అలాగే ఇతర అనేక పూజ శుభకార్యాలకు పసుపును ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఇలా నోములు నోచుకున్నప్పుడు ముత్తైదువులకు కాళ్లకు పసుపును రాయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక పెళ్లిళ్ల సమయంలో స్త్రీలు ముఖానికి పసుపును రాసుకుంటూ ఉంటారు. ఇలా సందర్భానుసారం చాలా సందర్భాలలో ముఖానికి పసుపు రాసుకుంటూ ఉంటారు.
అయితే కాళ్లకు పసుపు రాసుకోవడం మంచిది కానీ, పసుపు రాసుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలట. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాళ్లకు పసుపు ఎలా రాసుకోవాలి అన్న విషయానికి వస్తే.. మహిళలు పసుపు రంగు రాసుకోవడం కోసం రకరకాల పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటారు. గిన్నెలో కాస్త పసుపు వేసి నీరు పోసి కలిపి పాదాలకు అప్లై చేస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి అని చెబుతున్నారు. ఇలా తడిపిన పసుపును కాళ్లకు పట్టించుకోవడం వల్ల అది శుభ ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు. మరి పసుపును ఎలా రాసుకుంటే దరిద్రం అన్న విషయానికి వస్తే..
అరచేతులలో పసుపు వేసుకొని ఆ పసుపులో కాసిన్ని నీళ్లు పోసుకుని రెండు చేతులకు కాళ్లకు రాసుకుంటూ ఉంటారు. ఇంకొందరు కాలిపైన కాస్త పసుపు వేసుకొని కొన్ని నీళ్లు చల్లుకొని రాసుకుంటూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. పసుపును తడపకుండా కాలిపై వేసుకోవడం అన్నది దరిద్రపు అలవాటుగా పరిగణిస్తారు. ఈ విధంగా చేస్తే ప్రాణహాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. కాబట్టి ఎప్పుడైనా సరే కాళ్లకు పసుపు రాసుకోవాలి అనుకున్నవారు ముందుగా పసుపును నీళ్లతో తడిపి ఆ తర్వాత కాళ్లకు పట్టించడం అన్నది సరైన పద్ధతి అని ఇలా చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి అని చెబుతున్నారు.