Night: రాత్రి పడుకునే ముందు జడ వేసుకొని పడుకోవాలా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి, వస్త్రధారణ ఇలా అన్నీ మారిపోయాయి. అయితే ఒకప్పుడు పెద్దలు చెప్పిన విషయాలను పి

  • Written By:
  • Publish Date - June 27, 2024 / 04:49 PM IST

కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి, వస్త్రధారణ ఇలా అన్నీ మారిపోయాయి. అయితే ఒకప్పుడు పెద్దలు చెప్పిన విషయాలను పిల్లలు తూచా తప్పకుండా పాటించే వాళ్ళు. కానీ ఈ జనరేషన్ పిల్లలు తల్లిదండ్రుల మాటలు ఇంట్లో పెద్దల మాటలను అస్సలు లెక్కచేయకుండా వారు చెప్పిన మాటలను మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తున్నారు. కానీ మత గ్రంధాలలో, మనం జీవితంలో స్వీకరించవలసిన అనేక విషయాలు చెప్పబడ్డాయి. మీరు ఈ నియమాలను పాటిస్తే, మీరు జీవితంలో ఆనందం, శ్రేయస్సు పొందవచ్చు. మీరు ఈ నియమాలకు విరుద్ధంగా వెళితే, మీరు జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అలాంటి వాటిలో జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్లడం ఒకటి. అలాగే రాత్రి సమయంలో పడుకునేటప్పుడు జుట్టు ముడి వేసుకోవాలి అన్న విషయం కూడా ఒకటి. ఏ దేవుడిని పూజించినా, పూజించకపోయినా జుట్టు విప్పి గుడికి వెళ్లకూడదని అంటారు. నిద్రపోయే ముందు జుట్టు కట్టుకోవాలనే నియమం కూడా ఉంది. మహిళలు రాత్రి పడుకునే ముందు జుట్టు ముడి వేసుకుని పడుకోవాలని చెబుతూ ఉంటారు.. దీని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూర్వం స్త్రీలకు దాదాపు అందరికీ పొడవాటి జుట్టు ఉండేది. కానీ ఈ రోజుల్లో అందరూ జుట్టు పొట్టిగా ఉంచుకోవడమే ఫ్యాషన్ గా భావిస్తున్నారు.

నిత్యం జుట్టు విప్పుకొని ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. రాత్రి పూట కూడా జుట్టు ఫ్రీగా వదిలేసి నిద్రపోతూ ఉంటారు. ఇది ఇప్పుడు ఒక ఫ్యాషన్. కానీ శాస్త్రాల ప్రకారం జుట్టు విప్పి అలా పడుకుంటే జీవితంలో ప్రతికూల ప్రభావం పడుతుంది. సానుకూల ప్రభావం ఉండదు. జడ అల్లకుండా వదిలేయడం విచారానికి సంకేతం. ప్రతికూల శక్తి రాత్రిపూట చురుకుగా మారుతుందని నమ్ముతారు. రాత్రిపూట జుట్టు విప్పి నిద్రిస్తే నెగెటివ్ ఎనర్జీ స్త్రీలను డామినేట్ చేసే అవకాశం ఉంది. నెగెటివ్ ఎనర్జీ ప్రభావంతో కోపం పెరిగే అవకాశం ఉంది. ఒత్తిడి కనిపిస్తుంది. జీవితంలో శాంతి ఉండదు. రాత్రిపూట జుట్టు విప్పి నిద్రపోతే జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. అలాంటి మహిళల ఇంట్లో కుటుంబ కలహాలు పెరగడం మొదలవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వైరుధ్యం, కలహాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నలుపు రంగు శని రంగు. నల్ల వెంట్రుకలు విప్పి పడుకోవడం వల్ల శని దోషం వచ్చే అవకాశం ఉంది.

అదేవిదంగా రాత్రిపూట జుట్టు విప్పి నిద్రించడం మంచిది కాదు. రాత్రిపూట జుట్టు వదిలేసి పడుకోవడం వల్ల జుట్టు దిండుకు పట్టుకుంటుంది. దీంతో జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల జుట్టు బలహీనమవుతుంది. రాత్రి పూట వెంట్రుకలు విప్పి పడుకున్నప్పుడు జుట్టు ఎక్కువగా చిక్కులు పడతాయి. ఉదయాన్నే తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జుట్టు రాలిపోతుంది. దీంతో జుట్టు బలం కూడా తగ్గుతుంది. రాత్రిపూట జుట్టు విప్పి పడుకోవడం వల్ల నిద్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా సార్లు ముఖంలో వెంట్రుకలు నిద్రకు భంగం కలిగిస్తాయి. అంతేకాకుండా ముఖంపైకి వచ్చే జుట్టులో చుండ్రు వల్ల కూడా చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.