Wash Clothes: రాత్రిపూట దుస్తులు ఉతకకూడదా.. ఉతికితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని కొన్ని సమయాలలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి వాటి

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 10:00 PM IST

వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని కొన్ని సమయాలలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి వాటిలో రాత్రిపూట దుస్తులు ఉతకకూడదు అన్న నియమం కూడా ఒకటి. మరి రాత్రిపూట నిజంగానే బట్టలు ఉతకకూడదా? ఒకవేళ ఉతికితే ఏం జరుగుతుందో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట దుస్తులు ఉతకకూడదు లేదా ఆరబెట్టకూడదు. అలా చేయడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి రాత్రిపూట దుస్తులు ఉతికితే భవిష్యత్తులో చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

కాబట్టి రాత్రిపూట బట్టలు ఉతకడం ఆరేయడం లాంటివి అస్సలు చేయకండి. వాస్తు ప్రకారం, రాత్రిపూట దుస్తులు ఉతకడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. అలాగే తడి దుస్తులు రాత్రిపూట బయట ఆరబెట్టకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అడుగుపెడుతుందట. అంతేకాదు, మరుసటి రోజు ఉదయం ఈ బట్టలు ధరించడం ఒక వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే, చేయాలి అనుకున్న ప్రతి పనికీ అంతరాయం కలిగే అవకాశం ఉంటుందట. రాత్రిపూట దుస్తులు ఉతకడం వల్ల మనస్సు చంచలంగా మారుతుంది. అంతేకాకుండా, ఒక వ్యక్తి అన్ని సమయాలలో ఒత్తిడికి గురవుతాడు.

కాబట్టి రాత్రిపూట దుస్తులు ఉతకడం తప్పు. కొన్ని కారణాల వల్ల మీరు రాత్రిపూట దుస్తులు ఉతకవలసి వస్తే, వాటిని బహిరంగ ప్రదేశంలో అంటే ఆకాశం కింద ఆరబెట్టవద్దు. ఇంటి లోపల ఆరపెట్టుకోవచ్చు. బహిరంగ ప్రదేశంలో ఆరబెట్టడం వల్ల వాటిపై సూక్ష్మక్రిములు వచ్చి చేరుతాయి. లేదా పక్షి మలమూత్రాలు దానిపై పడే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా సమస్య అవుతుంది.