Site icon HashtagU Telugu

Black Colour: శుభాకార్యాలకు నల్ల బట్టలు వేసుకొని వెల్లకూడదా?

Mixcollage 15 Mar 2024 04 05 Pm 7453

Mixcollage 15 Mar 2024 04 05 Pm 7453

హిందువులు పూర్వకాలం నుంచే ఎన్నో రకాల ఆచార్య వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అయితే వాటిని మూఢనమ్మకాలు అని కొట్టి పడేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో శుభకార్యాలకు వెళ్లేటప్పుడు నల్ల బట్టలు ధరించకూడదు అన్న విషయం కూడా ఒకటి. బ్లాక్ కలర్ చాలా మంది ఇష్టముంటుంది. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా బ్లాక్ కలర్ బట్టలు, వాచ్ , బూట్లు మొదలైనవి ఎన్నో కొంటుంటారు. కానీ హిందూ మతంలో నలుపు రంగును పవిత్రంగా పరిగణించరు.

ఎందుకంటె హిందూ మతంలో పెళ్లి అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు నలుపు రంగు వాడకాన్ని నిషేధించారు. బ్లాక్ కలర్ బట్టలు, వాచ్ లను పెట్టుకోవడం వల్ల చెడు శకునాలు వస్తాయని నమ్ముతారు. అలాగే జ్యోతిష్యం ప్రకారం.. నలుపు రంగు శనితో ముడిపడి ఉంటుంది. మనలో చాలా మంది నల్ల చారలతో ఉన్న గడియారాలు ధరించడం చూసి ఉంటారు. జాతకంలో శని మంచి స్థానంలో ఉంటే కొన్నిసార్లు జ్యోతిష్యులు నలుపు రంగు ధరించమని సలహానిస్తారు. అలాగే జాతకంలో శనిదేవుడు మంచి స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి గౌరవం, డబ్బు, కీర్తి లభిస్తుంది.

అందుకే నల్ల పట్టీతో గడియారం ధరించడం చెడు శకునంగా పరిగణించబడదు. దీపావళి, సంక్రాంతి, దసరా, రక్షా బంధన్ వంటి పండుగలకు ప్రకాశవంతమైన రంగు బట్టలనే వేసుకుంటుంటారు. కానీ ఎట్టి పరిస్థితిలో బ్లాక్ కలర్ బట్టలను మాత్రం వేసుకోరు. అలాగే దేవాలయాలకు లేదా ఏదైనా పెద్ద వేడుకలకు వెళ్లేటప్పుడు కూడా బ్లాక్ కలర్ బట్టలను వేసుకోరు. బ్లాక్ కలర్ సాధారణంగా దుఃఖంతో ముడిపడి ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకే శుభకార్యాలకు నలుపు రంగు బట్టలను వేసుకోరు. నలుపు రంగు మరణం, చీకటికి ప్రతీకగా భావిస్తారు. అయితే చెడు కంటి చూపు పడకుండా ఉండేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే చిన్న పిల్లలకు కాటుకతో బొట్టు పెడతారు. అయితే సోమ, మంగళవారాల్లో నలుపు రంగు బట్టలను చాలా మంది వేసుకోరు. సోమవారం సాధారణంగా శివుడికి అంకితం చేయబడింది. సోమవారం నాడు భక్తులు శివుడిని పూజిస్తారు. హిందూ మతంలో శివుడు అత్యున్నత శక్తుల దేవుడిగా పరిగణించబడతాడు. అలాగే ఈ ఈ రోజు బ్లాక్ కలర్ బట్టలను వేసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే నలుపు రంగు చీకటి, మరణంతో సంబంధం కలిగి ఉంటుంది.