Family God: కుల దైవాన్ని మరిస్తే అలాంటి కష్టాలు ఎదురవుతాయా?

భారతదేశంలో హిందువులకు కులదైవ ఆరాధన ఎంతో విశిష్టమైనది. కేవలం హిందువులకు అని మాత్రమే కాకుండా భారతీయ కుటుంబ వ్యవస్థలో కూడా కులదైవ ఆరాధన అనేది

  • Written By:
  • Publish Date - June 27, 2023 / 07:30 PM IST

భారతదేశంలో హిందువులకు కులదైవ ఆరాధన ఎంతో విశిష్టమైనది. కేవలం హిందువులకు అని మాత్రమే కాకుండా భారతీయ కుటుంబ వ్యవస్థలో కూడా కులదైవ ఆరాధన అనేది ఉంది. అయితే చాలామందికి ఇంటి దేవతలుగా గ్రామ దేవతలు వంటి వారే ఎక్కువగా ఉంటారు. కొద్ది మందికి మాత్రం పురాణ దేవతలు కూడా కులదైవాలుగా ఉంటారు. కొందరికి దక్షిణామూర్తి, మరికొందరికి హయగ్రీవుడు కులదైవాలుగా ఉంటే మరి కొందరికి నరసింహస్వామి, వేంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, పాండురంగడు వంటి దేవుళ్లుగా ఉంటారు. అందుకే గృహంలో జరిగే ఎటువంటి శుభకార్యం జరిగిన కూడా గృహస్థులు ఈ దేవతలకు ప్రాధాన్యతను ఇచ్చి మొదట పూజించి తర్వాత ఇతర కార్యక్రమాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే శుభకార్యాలకు మొదట వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. అలా చెయ్యడం వల్ల కుటుంబం సురక్షితంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ శాంతులు నిలిచి ఉండాలని పూర్వీకుల నుంచి కూడా కులదేవత ఆరాధన చేస్తూ వచ్చారు. కుల దైవం కుటుంబాన్ని కాపాడుతుంది. అన్న రకాల అననుకూల శక్తుల నుంచి కుటుంబాన్ని రక్షిస్తుంది. ఒకవేళ కులదేవాన్ని మరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కులదైవాన్ని మరిస్తే కుటుంబం చుట్టూ ఆవరించి ఉన్న దైవ శక్తి రక్షణ చక్రం కనుమరుగవుతుంది. దీని కారణంగా ప్రమాదాలు, ప్రతికూల శక్తుల విజృంబణ, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

పదే పదే రకరకాల అడ్డంకులతో కుటుంబ పురోగతి కుంటు పడుతుంది. కుటుంబంలో సంస్కారం క్షీణించడం, అనైతికత, అసమ్మతి, అశాంతి చెలరేగుతాయి. గ్రహచారం బాగున్నా కుటుంబంలో సంక్షేమం ఉండకపోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి కులదైవానికి సముచిత స్థానం ఇవ్వక పోయినా, సరైన గౌరవం దక్కకపోయినా, సరైన రీతిలో ఆరాధించకపోయినా వారి శక్తి నశించి కుటుంబం కుంటుపడుతుంది. అలా జరిగితే మీరు ఏదేవతారాధన చేసినా కూడా అది వారికి చేరదు. బయటి నుంచి వచ్చే దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు చాలా సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అయితే మాములుగా ప్రతి కుంటుంబానికి వారి కుల దైవానికి సంబంధించిన ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది.

ఆ ఆచారాన్ని అనుసరించి ఏడాదిలో ఒకసారి లేదా రెండు సార్లు ప్రత్యేకమైన రోజులలో కులదైవారాధాన ప్రత్యేకంగా చేస్తారు. ఇది కాకుండా శుభకార్యాల సమయంలో తప్పకుండా కుల దైవారాధన చేసుకోవాల్సి ఉంటుంది. కులదేవతను విస్మరిస్తే జన్మ జాతకాల్లో దోషాలు ఏర్పడుతాయి. మంచి గ్రహ రాశులు కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహల అనుకూలత కోసం తప్పనిసరిగా కుల దేవతారాధన చేసుకోవాలి. ఏ దేవతారాధన చేసిన కులదైవాన్ని విస్మరిస్తే ఆ పూజ ఫలించదు. తల్లిదండ్రులను, కుల దైవాన్ని పూజించి వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. వారి ఆశీర్వాదం లేకుండా ఇంకెలాంటి ఆశీర్వాదం లభించదు.కులదేవతారాధన విస్మరించిన కుటుంబంలో నిరంతరం ఏదో ఒకరకమైన కలతలు వేధిస్తూ ఉంటాయి. కాబట్టి కులదేవత ఆరాధన తప్పనిసరి.