Site icon HashtagU Telugu

Navagraha: నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్లు కడుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Navagraha

Navagraha

మామూలుగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు చాలా వరకు కొన్ని కొన్ని దేవాలయాల్లో నవగ్రహాలను మనం చూసే ఉంటాం. ఆలయం బయట మనకు ఈ నవగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొందరు మొదట నవగ్రహాలకు పూజ చేసి ప్రదక్షిణలు చేసిన తర్వాత ప్రధాన ఆలయంలోకి వెళితే మరి కొందరు ప్రధాన ఆలయ దర్శనం తర్వాత నవగ్రహాలకు వెళుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తరువాత పూజలు చేసిన తర్వాత కాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. మరి ఇలా చేయడం మంచిదేనా!

నిజంగానే నవగ్రహాలకు పూజ చేసిన తర్వాత ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లు కడుక్కోవాలా ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా మనం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు శుభ్రంగా కాళ్లు కడుక్కొని లోపలికి ప్రవేశిస్తూ ఉంటాం. అలాగే వెళ్లిన తర్వాత నేరుగా ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాం. గుడికి వెళ్లి వచ్చిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్లి ఆ తర్వాత కాళ్లు కడుక్కోవడం లాంటివి చేస్తూ ఉంటారు. గుడి నుంచి వచ్చిన తర్వాత నేరుగా కాళ్లు కడుక్కుంటే ఆ పుణ్యఫలం మనతో పాటు ఇంట్లోకి రాదని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇంట్లో గానీ ఆలయంలో గానీ శనైశ్చరుడికి దానం ఇచ్చినపుడు మాత్రమే కాళ్ళు కడుక్కోనే ఆచారం ఉంది. పూజ చేసి కాళ్ళు కడిగేసుకోవడం ఏదో తప్పు చేసి, పాప ప్రక్షాళన చేసుకొన్నట్టు.

కాళ్ళు కడుక్కోవడం అంటే స్నానం చేయడంతో సమానం. కాబట్టి నవగ్రహారాధన కూడా దేవతారాధనలో అంతర్భాగమే కనుక నవగ్రహ దర్శనం చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలి అనడం సత్య దూరము. అది మంచి పద్ధతి కాదట. నవ గ్రహాలను దర్శించుకున్న తర్వాత ఆ దైవ వీక్షణం మనమీద ఉంటుంది. మనలో చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి కాళ్ళు కడుక్కుని వచ్చి, ప్రధాన దేవతాదర్శనం, ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఇది అత్యంత దోషము. గ్రహాధిపతులపట్ల మనం చేసే అపచారం అవుతుంది. ఇలా నవగ్రహ ప్రదక్షిణలు చేసిన తరువాత వెంటనే కాళ్లు కడుక్కోరాదట.