Pooja Tips: పూజ గదిలో గ్లాసు నీళ్లు తప్పనిసరిగా పెట్టాలా.. పండితులు ఏం చెబుతున్నారంటే!

మన ఇంట్లో ఉండే పూజ గదిలో దేవుడి ఫోటోలు విగ్రహాలతో పాటు దీపారాధన అగరత్తులు ఇంకా దేవుళ్లకు సంబంధించిన పూజా సామాగ్రి ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది పూజ గదిలో నీటితో నింపిన రాగి చెంబు లేదంటే గాజు పాత్రను పంచ పాత్రను ఉంచుతూ ఉంటారు.

  • Written By:
  • Updated On - July 18, 2024 / 04:23 PM IST

మన ఇంట్లో ఉండే పూజ గదిలో దేవుడి ఫోటోలు విగ్రహాలతో పాటు దీపారాధన అగరత్తులు ఇంకా దేవుళ్లకు సంబంధించిన పూజా సామాగ్రి ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది పూజ గదిలో నీటితో నింపిన రాగి చెంబు లేదంటే గాజు పాత్రను పంచ పాత్రను ఉంచుతూ ఉంటారు. పూజ గదిలో నీటిని ఎందుకు ఉంచుతారు అన్న విషయం చాలామందికి తెలియదు. మనం ఇలా గాజు గాని లేదంటే పంచ పాత్రలో నీరు పెట్టడం అన్నది వ్యాపార స్థలాలలో ఎక్కువగా చూసి ఉంటాం. వ్యాపార ప్రదేశాలలో గాజు గ్లాసులో మంచినీరు పెట్టి అందులో నిమ్మకాయ పువ్వు వంటివి పెడుతూ ఉంటారు.

మరి పూజ గదిలో ఈ విధంగా నీరు ఎందుకు పెట్టాలి? దీని వెనుక ఉన్న రీజన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందూ సంప్రదాయాల ప్రకారం, దేవతలను పూజించే ముందు, విగ్రహాలను నీటితో కడిగి, గదిలో నీరు చల్లి శుభ్రం చేయాలి. కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి ఆ నీటిని పూజా గదిలో ఉంచాలి. ఇది ప్రదేశాన్ని శుద్ధి చేయడంతో పాటు దేవతలను ప్రసన్నం చేస్తుందట. అయితే పూజ ప్రారంభించే ముందు ప్రతి ఇంట్లో నీళ్లు చల్లుతారన్న విషయం మనందరికీ తెలిసిందే. సాధారణ నీరు కాకుండా ఈ విధంగా తులసి నీళ్లతో చల్లడం ఇంకా మంచిదటీ. హిందూ మతంలో వరుణుడు నీటి రూపాన్ని తీసుకుంటాడు. పూజ గదిలో నీటిని ఉంచడం వల్ల వరుణదేవుడు ప్రసన్నం చేసుకుంటాడు.

ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వస్తుందట. రోజు పూజ తర్వాత మనము దేవతలకు పండ్లు, స్వీట్లు లేదా పంచామృత వంటి ప్రసాదం లేదా నైవేద్యాన్ని అందిస్తాము. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఆ నీటిని దేవతలకు ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది శ్రేయస్సును ఆహ్వానిస్తుందని చెబుతున్నారు. హారతి పళ్లెంలో నీళ్లు పోసి నాలుగు దిక్కులూ చల్లుతారు. పూజానంతరం దేవతల పాదాలను కడిగే శరణామృతాన్ని అందరికీ అందజేస్తారు. పూజా స్థలంలో నీటి కుండను ఉంచడం వల్ల ఆ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుందట. అలాగే ఆ నీరు పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. అందువల్ల, పూజా గదిలో నీటిని ఉంచేటప్పుడు వాస్తు సూత్రాలను గుర్తుంచుకోవాలట. ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో నీటి పాత్రను ఉంచాలట. నీటిని నిల్వ చేయడానికి రాగి లేదా ఏదైనా లోహపు పాత్రను ఎంచుకోవాలట. రాగి మంచి ఎంపిక ఎందుకంటే ఇది ప్రతికూలతను గ్రహిస్తుందట. అదనంగా, ఇది ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందట. అలాగే ప్రతి పూజ తర్వాత నీటిని తప్పకుండా మార్చాలట.

Follow us