Astro Tips: ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా?

మామూలుగా మనం ఇంట్లోనే పూజ మందిరంలో ఎంతోమంది దేవుళ్ళ చిత్ర పటాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటాం. అయితే ఇంట్లో ఉండాల్సిన దేవుడి చిత్ర ఫోటోలలో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో తప్పనిసరి అంటున్నారు పండితులు. దాదాపుగా ఈ ఫోటో అందరి ఇళ్లలో ఉండే ఉంటుంది. ఒకవేళ

  • Written By:
  • Publish Date - July 5, 2024 / 01:11 PM IST

మామూలుగా మనం ఇంట్లోనే పూజ మందిరంలో ఎంతోమంది దేవుళ్ళ చిత్ర పటాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటాం. అయితే ఇంట్లో ఉండాల్సిన దేవుడి చిత్ర ఫోటోలలో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో తప్పనిసరి అంటున్నారు పండితులు. దాదాపుగా ఈ ఫోటో అందరి ఇళ్లలో ఉండే ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఈ ఫోటో తప్పనిసరిగా ఉండాల్సిందే అంటున్నారు పండితులు. మరి దీని వెనుక ఉన్న ఆ కారణం ఏంటో ఎందుకు ఆ ఫోటో తప్పనిసరిగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ ఇంట్లోని పూజ మందిరంలో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుందట.

ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారికి నయమవుతుందట. శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఆంజనేయుడు ఇలా అందరూ కలిసి ఉంటారు. ఇంట్లో ఈ చిత్ర పటం పెట్టుకుంటే రామరాజ్యం వలె ఇంటి సభ్యులు కలిసి ఉంటారు. ఇంట్లో ఈ ఫోటో ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా సద్దుమనుగుతాయి. ఎప్పటినుంచో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈజీగా ఆ సమస్యల నుంచి బయటపడతారు. నిత్యం శ్రీరాముని పూజించే రామ భక్తులు మరణం తర్వాత నరకం నుంచి విముక్తి పొందుతారట.

పట్టాభిషేకం ఫోటోలో వినాయకుడు, శివుడు ఆంజనేయుడు సప్తరుషులు ఉంటారు. ఇలాంటి ఫోటో పెట్టడం వల్ల పిల్లాపాపలతో సంతోషంగా ఉంటారట. అంతేకాకుండా ఈ సీతారాములు ఫోటోకు ఎర్ర రంగు పూలతో పూజించాలి. కాబట్టి ఇంట్లో ఏ ఫోటో ఉన్నా లేకపోయినా ఈ శ్రీరాము పట్టాభిషేకం ఫోటో మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే అంటున్నారు పండితులు. ఇంటి ప్రధాన ద్వారానికి లోపలి వైపు గుమ్మంపై మన పూర్వీకులు ఇలా శ్రీ రామ పట్టాభిషేకం ఫోటో ఏర్పాటు చేసుకునేవారు.