Wash Feet: రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు కడుక్కోవడం లేదా.. అయితే మీకు ఆ సమస్యలు రావడం ఖాయం?

మామూలుగా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు లేదంటే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మొదట కాళ్లు కడుక్కోమని చెబుతూ ఉంటారు. అలాగే మనం బయట ఎక్కడైన

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 10:20 PM IST

మామూలుగా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు లేదంటే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మొదట కాళ్లు కడుక్కోమని చెబుతూ ఉంటారు. అలాగే మనం బయట ఎక్కడైనా తిరిగి వచ్చినప్పుడు మొదట కాళ్లు కనుక్కోమని పెద్దలు సూచిస్తూ ఉంటారు. కానీ చాలామంది వాటిని చాదస్తం అని అనుకుంటూ ఉంటారు. అలాగే చాలామందికి రాత్రి సమయంలో పడుకునే ముందు కూడా కాళ్లు కడుక్కుని పడుకోవడం అలవాటు. అలాగే గుళ్లోకి వెళ్లే ముందు కూడా కాళ్లు కడుక్కోమని చెబుతూ ఉంటారు.

చేతులు, కాళ్ళు కడుక్కోకపోతే ఆరోగ్య పరంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా అనేక రకాల సమస్యలు వస్తాయి. కాళ్ళు కడుక్కోకపోతే మన ఆరోగ్యంతోపాటు కుటుంబంలోని వారందరి ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అందుకే ఎవరైనా బయట నుంచి ఇంట్లోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్లు కడుక్కోవడం కూడా మన ఆచారాలలో ఒకటిగా మారిపోయింది. బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడల్లా ముందుగా చెప్పులు లేదా షూస్ తీసేసి కాళ్లు కుడుక్కుంటే శరీరంలో అన్ని రకాల ప్రతికూల శక్తిని నాశనం చేసి మనసుని స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఎందుకంటే బయట ఎక్కడెక్కడో తిరుగుతూ తెలియకుడానే ఏవేవో తొక్కుతారు. అలాగే ఇంట్లోకి వెళ్లిపోతే కొందరి ఆరోగ్యానికైనా హాని కలుగుతుంది. మరీ ముఖ్యంగా పసి పిల్లలకు మరింత హాని జరుగుతుంది. మంచి నిద్రకావాలంటే నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్లు కడుక్కుంటే శరీరంపై ప్రతికూల శక్తి ప్రభావం భిన్నంగా ఉంటుంది. నిద్రపోయేముందు మాత్రమే కాకుండా నిద్ర మధ్యలో ఏవైనా చెడు కలలు వచ్చినా, భయపడినా వెంటనే లేచి పాదాలు కడుక్కుని బాగా తుడుచుకుని నిద్రపోతే ప్రశాంతంగా నిద్రపడుతుంది. కొందరైతే బయట తిరిగొచ్చి అలసిపోయామంటూ అలాగే మంచం ఎక్కేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ప్రశాంతమైన నిద్రదూరం కావడం మాత్రమే కాదు, భయపెట్టే కలలు వెంటాడుతాయి. కాబట్టి ఎంత అలసిపోయినా కూడా రెండు నిమిషాల సమయం కేటాయించి కాళ్లు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడం మంచిది. సాధారణంగా గుడికి అనగానే స్నానం చేసి బయలుదేరుతారు. శుభ్రమైన దుస్తులు వేసుకుంటారు. అయినప్పటికీ గుడి దగ్గరకు వెళ్లగానే బయట కాళ్లు కడుక్కునే లోపలకు దర్శనానికి వెళతారు.

ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగొచ్చి బయట విడిచిన చెప్పులు ధరించే గుడికి వెళతాం. అందుకే గుడి బైట పాదరక్షలను వదిలి, పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ, ఆపాదమస్తకం పరిశుభ్రం చేసుకుంటున్నాం అనుకుంటూ కాళ్లు కడుక్కుని తలపై నీళ్లు చల్లుకుంటారు. కొందరైతే నోటిలో నీరు పోసి మూడుసార్లు పుక్కిలించి బయటకు వదులుతారు. శరీరంతో పాటూ వాక్కుకి మూలకారకమైన నాలుక, నోరు కూడా శుభ్రపరుచుకుని నిన్ను ప్రార్థించేందుకు వస్తున్నా అని చెప్పడం అలా చేయడం యొక్క అర్థం.