Site icon HashtagU Telugu

Vinayaka Chaturthi: వినాయక చవితి రోజు మాత్రమే తులసీదళాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా?

Vinayaka Chaturthi

Vinayaka Chaturthi

ప్రతి ఏడాది భాద్రపద మాసంలో చతుర్థి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న మట్టి విగ్రహాల నుంచి భారీ గణనాథుల విగ్రహాలను ఏర్పాటు చేసి మరి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా వీధుల్లో పెద్ద పెద్ద భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ వినాయక చవితి పండుగను మూడు రోజుల నుంచి 11 రోజుల వరకు జరుపుకుంటూ ఉంటారు. ఇదే గణపతికు ఈ వినాయక చవితి పండుగ రోజున ఎర్రని పువ్వులతో పాటు ఏకాదశ పత్రాలు, ఉండ్రాళ్ళ పాశం, కుడుములు, మోదకాలు వంటివి ఎన్నో రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.

ఇకపోతే వారంలో బుధవారం రోజు విఘ్నేశ్వరుడికి అంకితం చేయబడింది. అందుకే బుధవారం రోజు విగ్నేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే మామూలు రోజులలో గణేష్ పూజలో తులసి దళాలను నిషేధించబడింది. విఘ్నేశ్వరుడు పూజలో తులసి ఆకులను అస్సలు ఉపయోగించరు. అయితే పురాణాల ప్రకారం దీని వెనుక ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. హంసధ్వజుని పుత్రుడైన ధర్మధ్వజునికి విష్ణువు అనుగ్రహాం వలన కలిగిన సంతానమే తులసి. ఈమె గంగా నదీ తీరంలో విహరిస్తున్నప్పుడు అటుగా వచ్చిన గణపతిని చూచి మోహిస్తుంది. తనను వివాహం చేసుకొమ్మని గణపతిని అడుగుతుంది. కానీ గణపయ్య మాత్రం ఆమెను అస్సలు పట్టించుకోడు.

దీంతో కోపంతో తులసీ నన్నే పట్టించుకోవా.. దీర్ఘకాలం బ్రహ్మచారిగానే ఉండిపొమ్మని గణపతిని శపిస్తుంది. దీంతో వినాయకుడు తనకు శాపం ఇచ్చిన తులసీకి కూడా.. రాక్షసునికి జీవితాంతం బందీగా ఉండిపొమ్మని తులసీకి ప్రతిశాపం ఇస్తాడు. అప్పటి నుంచి గణపయ్య పూజలో తులసీ ఉపయోగించరు. అయితే మిగతా రోజులలో విగ్నేశ్వరుడు పూజలో తులసీదళాలను ఉపయోగించరు. కానీ వినాయక చవితి రోజు మాత్రం తులసీదళాలను ఉపయోగించవచ్చని చెబుతున్నారు. చవితి రోజు మాత్రం మినహాయింపు ఉందని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. అందుకే వినాయకచవితి రోజు తప్ప మరేరోజూ వినాయకుడి తులసీ దళాలను ఉపయోగించకూడదు.