కార్తీక మాసం మొదలైంది. కార్తీకమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నది స్నానాలు, కార్తీకదీపాలు. ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయాని కంటే ముందు నది స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ నది స్నానాలు ఎందుకు చేస్తారు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయని, లోకాలను జయించి జీవితం సాఫల్యం పొంది శివ అనుగ్రహం పొందుతారట.
కార్తీక మాసంలో ప్రతి రోజు తెల్లవారుజామున స్నానం చేసి దేవాలయ దర్శనం చేయడం, శివుడికి గంగా జలం, పాలు సమర్పించడం ద్వారా కలిగే పుణ్యాలు అన్నీ మనిషి జీవన ప్రగతికి దోహదపడతాయట. కార్తీక మాసంలో ఉదయం, ముఖ్యంగా తెల్లవారుజామున స్నానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక పవిత్రత పొందవచ్చట. స్నానం తరువాత శివుడు, విష్ణువు పూజ చేయడం ద్వారా వారి కృప మనపై ఉంటుందని నమ్మకం. గంగ, యమునా, గోదావరి, కృష్ణా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం మరింత పుణ్యప్రదం. నదులకు వెళ్లలేనివారు ఇంట్లోనే గంగా జలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చని చెబుతున్నారు.
ఇలా స్నానం తరువాత శివుడికి బిల్వ దళాలు, పూలు సమర్పించి, దీపారాధన చేయాలట. విష్ణువు పూజ కూడా చేయవచ్చని చెబుతున్నారు. కార్తీక మాసంలో స్నానం చేయడం ద్వారా పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయట. పాప విముక్తి పొందడమే కాకుండా భవిష్యత్ పాపాలు కూడా చేర్చకపోవడానికి కార్తీక స్నానం తోడ్పడుతుందని చెబుతున్నారు. స్నానం ద్వారా శరీరంలోని చెడు వాయువులు తొలగిపోతాయట. ఇది ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. హిందూ సంప్రదాయంలో ప్రతి రోజు స్నానం చేయడం శుభప్రదంగా ఉంటుందని, కార్తీక మాసంలో చేయడం మరింత శుభప్రదం అని చెబుతున్నారు.