Snake: పాములు గర్భవతులను కాటు వేయవా.. ఇందులో నిజమెంత?

 కాలం మారిన టెక్నాలజీ డెవలప్ అయిన కూడా భారతదేశంలో హిందువులు ఇప్పటికీ ఎన్నో రకాల ఆచారాలను సంప్రదాయాలను, మూఢనమ్మకాలను సంస్కృతి సంప్రదా

  • Written By:
  • Publish Date - July 19, 2023 / 08:30 PM IST

కాలం మారిన టెక్నాలజీ డెవలప్ అయిన కూడా భారతదేశంలో హిందువులు ఇప్పటికీ ఎన్నో రకాల ఆచారాలను సంప్రదాయాలను, మూఢనమ్మకాలను సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. కొందరి నమ్మకాలను కొందరు మూఢనమ్మకాలు అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇక అసలు విషయంలోకి వెళితే… పురాణాల ప్రకారం గర్భిణీలను పాము కాటు వేయదని చాలామంది నమ్ముతూ ఉంటారు.  పురాణం ప్రకారం గర్భిణిల వద్దకు పాము వెళ్లదు. అలాగే గర్భిణీలను చూడగానే పాములు చూపు కోల్పోతాయి. అయితే గర్భిణీలను పాములు ఎందుకు కాటు వెయ్యవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనుషులకు ఇంద్రియాలు ఉన్నట్లుగానే పాముకు కూడా కొన్ని ఇంద్రియాలు ఉంటాయి.

ఈ ఇంద్రియాలను పాములు ఉపయోగించుకుంటూ ఉంటాయి. వాటి ద్వారానే పాములు జీవిస్తాయి. మనిషికి ఇంద్రియాలు ఎంత ముఖ్యమో పాము జీవితంలో కూడా ఇంద్రియాలు అంతే ముఖ్యమైనవి. ఈ ఇంద్రియాలతోనే పాములు స్త్రీని చూసి గర్భిణీ అవునో కాదో స్ఫష్టంగా గుర్తించగలుగుతుంది. గర్భం ధరించిన సమయంలో మహిళల్లో వచ్చే మార్పులను పాములు గుర్తిస్తాయి. అలా గుర్తించిన పాములు గర్భిణీలను కాటు వేయవట. ఒకప్పుడు ఒక గర్భిణీ శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర తపస్సు చేసింది. ఆమె శివ తపస్సులో మునిగి ఉన్న సమయంలో రెండు పాముల వల్ల ఆమె తపస్సుకు భంగం కలుగుతుంది. ఆమె అప్పటి వరకు చేసిన తపస్సు వల్ల వచ్చిన శక్తితో తన గర్భంలో ఉన్న పిండాన్ని గుర్తించగలుగుతుంది.

తన కడుపులో బిడ్డ సర్పజాతికి చెందినది కావడంతో పాటు తన తపస్సుకు భంగం కలిగించిన ఆ పాములను ఆ గర్భిణీ శపిస్తుంది. గర్భిణీలను చూడగానే పాముల కళ్లు కనిపించకూడదని ఆమె శాపం పెట్టింది. ఇక అప్పటి నుంచి గర్భిణీని చూడగానే పాములు గుడ్డివి అయిపోవడంతో పాటు గర్భిణీలను కాటు వేయడానికి సాహసించవని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. అలాగే గర్భిణీలకు కలలో కూడా పాములు కనిపించవని కూడా అంటారు. గర్భిణీని పాము కాటు వేయకపోవడానికి విశ్వాసం ఒక కారణం అయితే. శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గర్భవతి అయిన తర్వాత స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. అందులో హార్మోన్ల మార్పు కూడా ఒకటి. గర్భం ధరించిన స్త్రీ శరీరంలో కొన్ని ప్రత్యేక మార్పుపు జరుగుతాయి. వీటి వల్ల స్త్రీ స్వభావం, ఆసక్తి, రంగు రూపుల్లో చాలా రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. గర్భిణీ స్త్రీలలో వచ్చే ఈ మార్పులను పాములు తమ ఇంద్రియాలతో గుర్తిస్తాయి. అందుకే గర్భిణీల వద్దకు వెళ్లవట.