హిందూమతంలో పామును దైవంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ పరమేశ్వరుడి మెడలో నాగుపాము ఉండటం మనందరం గమనించే ఉంటాం. నాగ పాము దైవ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. ముఖ్యంగా నాగుల చవితి నెలలో ఈ పుట్టలకు నాగుల కట్టలకు ఒక ప్రత్యేకంగా పూజలు చేసి పాలు గుడ్లు వంటి కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే మామూలుగా చాలామంది గర్భిణీ స్త్రీలను పాములు కాటేయమని చెబుతూ ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీల నీడ ఆ పాము మీద పడితే ఆ పాముకి కళ్ళు పోతాయని, ఆ గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన తర్వాత మళ్లీ తిరిగి ఆ పాముకి కళ్ళు వస్తాయని చెబుతూ ఉంటారు.
మరి ఇందులో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాముకి సహజమైన ఇంద్రియాలు ఉన్నాయి. అవి స్త్రీ గర్భవతిగా ఉందో లేదో సులభంగా గుర్తించగలవు. గర్భం దాల్చిన మహిళల్లో పాములు సులభంగా గుర్తించగల కొన్ని మూలకాలు స్త్రీ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. వాటిని గుర్తించే గుణం పాములకు ఉంటుందట. బ్రహ్మవైవర్త పురాణంలోని ఒక కథ ప్రకారం.. ఒక గర్భవతి శివుని ఆలయంలో తపస్సు చేస్తోంది. ఆమె తపస్సులో పూర్తిగా మునిగిపోయింది. ఆ సమయంలో రెండు పాములు ఆలయంలోకి వచ్చి గర్భిణిని వేధించడం ప్రారంభించడంతో ఆ మహిళ తపస్సు భంగం కలిగింది.
తనను వేధిస్తున్న పాములను ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడింది. మహిళ తపస్సు భగ్నం అవ్వడంతో ఆ స్త్రీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈరోజు నుంచి గర్భిణి దగ్గరికి సర్పాలు వెళ్లితే అంధులవుతాయని సర్ప జాతి మొత్తాన్ని శపించాడు. ఆ తర్వాత గర్భిణీ స్త్రీని చూడగానే పాములు గుడ్డిగా మారతాయనీ, గర్భిణిని కాటేయవు అనే నమ్మకం ప్రాచుర్యంలోకి వచ్చింది. కథ ప్రకారం గర్భిణీ స్త్రీకి జన్మించిన శిశివు గోగా జీ దేవ్, శ్రీ తేజా జీ దేవ్, జహర్వీర్ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. అదేవిధంగా హిందూ మతంలో నాగు పామును చంపడం మహాపాపం కిందకు వస్తుంది. సర్పాన్ని చంపిన వ్యక్తీ తన జీవితంలో అనేక దుష్ప్రభావాలను అనుభవించవలసి ఉంటుందని, గర్భిణీ స్త్రీ పాములను చంపకూడదని నమ్ముతారు.