Vastu Tips : స్త్రీలు తల వెంట్రుకలు వీరబోసుకుని గుడిలోకి వెళ్తే ఎందుకు వెళ్లకూడదు…పురాణాలు ఏం చెబుతున్నాయి..?

మహిళలు తలవెంట్రుకలు వీరబోసుకుని ఆలయంలోకి ప్రవేశించకూడదని లేదా పూజలు చేయకూడదని హిందూ శాస్త్రాల్లో పేర్కొనబడింది.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 06:00 AM IST

మహిళలు తలవెంట్రుకలు వీరబోసుకుని ఆలయంలోకి ప్రవేశించకూడదని లేదా పూజలు చేయకూడదని హిందూ శాస్త్రాల్లో పేర్కొనబడింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మన మతగ్రంధాల్ల ఇలాంటి అనేక విషయాలను పేర్కొన్నారు. అవి కచ్చితంగా మన జీవితంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. స్త్రీలు ఏ రోజు తలస్నానం చేయాలి…బహిష్టు సమయంలో ఎలాంటి వస్తువులను తాకకూడదు…ఏరోజున కుంకుమను ధరించాలి, కంకణాలు ధరించడానికి ఎలాంటి నియమాలు ఉన్నాయి ఇవన్ని కూడా గ్రంధాలలో చెప్పబడ్డాయి.

ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన విషయం ఏంటంటే…ఆలయంలోకి ప్రవేశించే సమయంలో జుట్టు వీరబోసుకూడదు. మన ఇంట్లో పెద్దలు ఈ విషయాన్ని చెబుతుంటారు. అయితే ఎందుకు వెంట్రుకలు వీరబోసుకుని ఆలయాల్లోకి వెళ్లకూడదన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఇప్పుడు తెలుసుకుందాం.

గుడిలోకి వెళ్లేముందు వెంట్రుకలు వీరబోసుకోకూడదు:
ఆలయంలోకి వెళ్లేముందు మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఆలోచనలు లేదా ప్రతికూల భావోద్వేగాలు ఉండకూడదు. దేవున్ని ప్రార్ధించడం వెనకున్న ముఖ్య ఉద్దేశ్యం…మనం దేవుడికి దగ్గరవ్వడం. కాబట్టి మనం దేవాలయానికి వెళ్లినప్పుడు శుభ్రంగా, స్వచ్చంగా ఉండాలి. మనం ధరించే బట్టలతోపాటు మన శరీరం కూడా స్వచ్చంగా ఉండాలి.

వెంట్రుకలు వీరబోసుకుని ఆలయంలోకి ప్రవేశించకూడదనడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే…స్త్రీల మనస్సు దేవుడి మీద భక్తికి బదులుగా జుట్టును సరిచేయడంపై దృష్టి పెడుతుంది. వెంట్రుకలు కొప్పు వేసుకుంటే దృష్టి దేవుడి మీద పూజల మీదకు మళ్లుతుంది. కాబట్టి దేవాలయంలో కానీ పూజా గదిలోకి గానీ వెంట్రుకలు వదిలేసి వెళ్లకూడదు.

ప్రతికూలతకు చిహ్నంగా ఉంటుంది:
పురాణాల ప్రకారం …మహాభారతం, రామాయణంలో ఇలాంటి నియామాల గురించి చాలా ఉంది. రామాయణంలో కైకేయి గురించి అందరికీ తెలిసిందే. మహాభారతంలో ద్రౌపది దుష్టస్సాన్ తో అవమానించబడిన సంగతి తెలిసిందే. అందుకే జుట్టు వదులుగా ఉంటే..కోపంతో ముడిపడి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. వెంట్రుకలు వీరబోసుకుని గుడికి వెళ్తే…అది కోపానికి చిహ్నంగా పరిగణిస్తారు.

వెంట్రుకలు వదిలేసి పూజ చేస్తే…అరిష్టమట:
శాస్త్రాల ప్రకారం స్త్రీలు జట్టు వీరబోసుకుని పూజలు, శుభకార్యాలు చేస్తే…వారి ఆరాధన పూర్తిగా ఆమోదయోగ్యంగా ఉండదు. స్త్రీలు జుట్టు వదిలేసుకుని పూజలు చేస్తే దేవతలు అంగీకరించరు. ఇలా చేస్తే దురదృష్టాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. ఇలా చేస్తే ప్రతికూల శక్తికి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే స్త్రీలు జుట్టు వీరబోసుకుని దేవాలయాల్లోకి ప్రవేశించకూడదని పురాణాలు చెబుతున్నాయి.