మామూలుగా పండితులు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం మంచిదని చెబుతూ ఉంటారు. కానీ బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు లేవాలి అలా లేవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయాలు చాలా మందికి తెలియదు. అయితే బ్రహ్మ ముహూర్తంలో లేవమని చెప్పినప్పుడు చాలా మంది ఆ విషయాలను చాదస్తంగా తీసుకుంటూ ఉంటారు. అయితే సూర్యోదయానికి ముందు ఒకటున్నర గంటల సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా చెప్పబడినది. ముందు రోజు రాత్రి యొక్క చివరి గంటలైన ఈ కాలాన్ని అతి పవిత్రమైన కాలంగా భావించబడుతుంది. ఈ సమయంలో అద్యయనాలకు అత్యంత అనుకూలమైన సమయంగా ఉంటుందని, ఏకాగ్రత ఎక్కువగా ఉండి, అభ్యాసాలు ఎప్పటికీ గుర్తు ఉంటాయని పెద్దలు సూచిస్తూ ఉంటారు.
తద్వారా అనేకులు, సంగీత సాధనకు, విద్యాభ్యాసానికి ఈ సమయాన్ని ఎంచుకుంటూ ఉంటారు. హిందూ శాస్త్రాలు, పురాణాలు, వేదాల ప్రకారం ఈ సమయం నిద్ర లేయడానికి అనువైన సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో కాలుష్య కారకాలు తక్కువగా ఉండి, ప్రశాంతతకు అనువుగా ఉంటుంది. ఈ ముహూర్తం పవిత్రంగానే కాకుండా, ఆరోగ్యకర సమయంగా కూడా చెప్పబడుతున్నది. సమయంలో ఎటువంటి రణ గొణ ధ్వనులు ఉండవు. కాలుష్య కారకాల ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా మనసులో ఎటువంటి కల్లోలాలు కలగవు. క్రమంగా ఈ సమయంలో ఏకాగ్రతతో అభ్యాసాలు చేయవచ్చని చెప్తుంటారు. అలాగే ఈ సమయం యోగాకు, ధ్యానానికి మంచి సమయంగా, ఎటువంటి కాలుష్య జాడలు లేని తాజా ప్రాణ వాయువుతో కూడి ఉంటుంది.
తద్వారా ధ్యానానికి అత్యంత అనువైన సమయంగా చెప్పబడుతున్నది. ధ్యానానికి, పూజకు, అభ్యాసానికి, యోగాకు అత్యంత పవిత్ర సమయంగా ఈ బ్రహ్మ ముహూర్తం ఉన్నది. ముఖ్యంగా ఇటువంటి వాటికి ఏకాగ్రత అత్యవసరం, తద్వారా ఈ సమయంలో వీటికి ఉపక్రమించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చట. కాగా శరీరంలో జీవక్రియల నియంత్రణలో మూడు రకాల దోషాలు ఉన్నాయి. అవి వాత దోషం, పిత్త దోషం, మరియు కఫ దోషం. ఈ వాత పిత్త కఫ దోషాల ప్రభావాలు ఈ బ్రహ్మ ముహూర్త సమయం నందు అత్యంత కీలకంగా ఉంటాయి. వాత దోషం గాలికి ఆకాశానికి, పిత్త దోషం అగ్నికి, నీటికి కఫ దోషం భూమి నీటికి సంబంధించి ఉంటుంది. ఈ మూడింటి నిష్పత్తి పరిసరాలు, జీవక్రియల ప్రభావాల కారణంగా మారుతూ ఉంటాయి. పరిసరాలు క్షణ క్షణంలో మార్పులను చూస్తూ ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం లోని 48 నిమిషాలు మాత్రం ఎటువంటి మార్పులకు లోను కాకుండా, నిశ్చలంగా ఉంటుంది. కేవలం అందుచేతనే, ఎటువంటి సమస్యలు చుట్టు ముట్టకుండా ఏకాగ్రత పెరగడానికి దోహదం చేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. అయితే సూర్యోదయానికి ముందు 48 నిమిషాల ముందు, ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
ఇక్కడ ఉదయం 10 గంటల వరకు కఫం తన ప్రభావాన్ని చూపిస్తుంది, తర్వాత 10 నుండి 2 వరకు పిత్త ప్రభావం, మద్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 వరకు వాత ప్రభావాలు ఉండగా ఒక్కోసారి సాయంత్రం మొత్తం కొనసాగుతాయి కూడా. సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు మరలా కఫం తన ప్రభావాన్ని చూపగా, రాత్రి 10 నుండి వేకువజామున 2 వరకు పిత్త ప్రభావం ఉంటుంది. ఉదయం 2 నుండి 6 గంటల వరకు వాతం తన ప్రభావాన్ని చూపుతుంది. కానీ సూర్యోదయానికి ముందు సమయం ఈ ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుంది. ఈ సమయము నందు, సూర్యోదయానికి ముందు 48 నిమిషాల ముందు, ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఈకారణం చేతనే ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఎటువంటి దోషాలు ఈ బ్రహ్మ ముహూర్తాన పని చేయలేవు, తద్వారా జీవక్రియలకు ఎటువంటి ఆటంకం లేకుండా శరీరం మిన్నకుంటుంది. క్రమంగా ఏకాగ్రత తో చేసే ఎటువంటి పనులైనా సానుకూల ఫలితాలను అందివ్వగలవని చెప్తుంటారు. అందుకే బ్రహ్మ ముహూర్తంలో లేవమని పండితులు చెబుతుంటారు. అయితే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర రావడం వల్ల అటు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఇటు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేకూరుతుందట.