శివుడిని లయకారుడు అని అంటారు. శంకరుడు తనను ఎలా పూజించినా చాలా త్వరగా ప్రసన్నుడై భక్తులకు పూజా ఫలాలను అందిస్తాడని నమ్మకం. అందుకే శివుడిని భోళా శంకరుడు అని కూడా అంటారు. శివుడు అన్ని రకాల ఆడంబరాల నుండి దూరంగా ఉంటాడని నమ్ముతారు. అందుచేత శివారాధనలో గంజాయి, ఉమ్మెత్త, బిళ్వ పత్రం, , గంధపు ముద్ద, భస్మం, పచ్చి పాలు మొదలైన వాటిని ఉపయోగిస్తారు. శివుని పూజలో ఎటువంటి ఖరీదైన వస్తువులను ఉపయోగించకూడదు, ప్రధానంగా కొన్ని పదార్థాలను నివారించాలని నమ్ముతారు. అటువంటి పదార్థాలలో పసుపు ఒకటి. పురాణాల ప్రకారం, శివారాధనలో పసుపును ఉపయోగించడం వల్ల శివునికి కోపం వస్తుంది. పూజ యొక్క పూర్తి ఫలం లభించదు. అసలు శివలింగంపై పసుపు ఎందుకు ఉపయోగించకూడదో తెలుసుకుందాం.
పసుపు స్త్రీల అందానికి నేరుగా సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. పసుపును సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఈ కారణంగా శివునికి పసుపు అంటే ఇష్టం ఉండదు. వాస్తవానికి పురాణ గ్రంధాలలో, శివలింగం శక్తికి చిహ్నం. ఇక పసుపు స్త్రీల అందాన్ని పెంచేందుకు వాడే మూలిక. అందువల్ల శివలింగంపై పసుపును సమర్పించడం నిషిద్ధమని నమ్ముతారు. సాధారణంగా శివుడు కాకుండా మరేదైనా దేవతను అయినా పసుపుతో పూజించడం పవిత్రంగా భావిస్తారు.
శివలింగం అనేది శివుని శక్తికి ప్రతీక.
శివలింగం అనేది శివుని శక్తికి ప్రతీక, లింగం శివుని శక్తిని సూచిస్తుంది కాబట్టి, గంజాయి, దాతుర, పచ్చి పాలు, చందనం మొదలైన చల్లని వస్తువులతో పూజిస్తారు. పసుపు ప్రభావం వేడిగా ఉంటుంది. శివలింగంపై పసుపు వేయడం వల్ల వేడి పెరుగుతుందని నమ్ముతారు, అందుకే శివారాధనలో పసుపును ఉపయోగించడం నిషేధించబడింది.
శివారాధనలో పసుపుతో పాటు ఈ వస్తువులను కూడా ఉపయోగించడం నిషేధించబడింది.
పురాణాల ప్రకారం, పసుపుతో పాటు, శివపూజలో ఇంకొన్ని ఇతర వస్తువులను ఉపయోగించడం కూడా నిషేధించారు. శివ పూజలో సింధూరం, తులసి ఆకులు కూడా ఉపయోగించకూడదు. సింధూరం శివుడికి సమర్పించ కూడదు. ఎందుకంటే సింధూరం స్త్రీల మాంగళ్యానికి చిహ్నం అందుకే ఉపయోగించకూడదు.