Site icon HashtagU Telugu

‎Donate: దాన ధర్మాలు కుడి చేతితోనే ఎందుకు చేయాలి.. ఎడమ చేయి ఉపయోగిస్తే ఏమవుతుందో తెలుసా?

Donate

Donate

‎Donate: మామూలుగా మనం దానం చేసే వాటి నుంచి ప్రతి ఒక్క మంచి పనిలో కుడి చేతిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ కుడి చేతిని ఉపయోగించడం అన్నది శుభప్రదంగా పరిగణిస్తారు. కాగా ఇది సూర్యుడు, బృహస్పతితో ముడి పడి ఉంటుంది. కుడి చెయ్యి బలం, స్వచ్ఛత, మతం, దాతృత్వానికి చిహ్నంగా, ఇక ఎడమ చెయ్యి.. చంద్రుడు, రాహువుతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. ఇకపోతే హిందూ ధర్మంలో దానధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. పేదవారికి, ఆకలి అన్నవారికి, అవసరం ఉన్నవారికి దానధర్మాలు చేస్తూ ఉంటారు.

‎ ఎవరితో స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు రకరకాల దానధర్మాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది అని నమ్మకం. అయితే ఎవరికి అయినా ఏదైనా దానం చేసేటప్పుడు కుడి చేతితోనే ఇవ్వాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎడమ చేతితో దానాలు అస్సలు చేయకూడదని చెబుతుంటారు. ఎందుకు అంటే కుడి చేయి స్వచ్ఛత, శుభం, దైవిక శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇది సూర్యుడితో ముడిపడి ఉంటుంది. ఇది శక్తి, దాతృత్వం, జ్ఞానాన్ని సూచిస్తుందని, కుడి చేతిని ఎల్లప్పుడూ దానధర్మాల్లో ఉపయోగించడం గౌరవంగా భావిస్తారట.

‎కేవలం దానధర్మాలలో మాత్రమే కాదు ఎవరినైనా ఆశీర్వదించడానికి కూడా కుడి చేయి మంచిదని భావిస్తారు. ఎడమ చేతిని కుడి చేతి కంటే తక్కువ శుభప్రదంగా భావిస్తారు. ఇది ప్రధానంగా మలవిసర్జన, శుభ్రపరచడం లేదా రోజువారీ పనులు వంటి వ్యక్తిగత లేదా అశుద్ధ కార్యకలాపాలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల, ఎడమ చేతితో దానధర్మాలు చేయడం ఆ కార్యానికే అగౌరవంగా పరిగణిస్తారు.

‎కుడి చేతితో దానం చేయడం వల్ల సూర్యుడు, బృహస్పతి గ్రహాల నుండి ఆశీర్వాదాలు వస్తాయని నమ్మకం. ఇది అదృష్టానికి దారితీస్తుంది. ప్రతికూల కర్మ పరిణామాల నుండి రక్షణను అందిస్తుంది. దీనికి విరుద్ధంగా, ఎడమ చేయి చంద్రుడు, రాహువు తో ప్రభావితమవుతుంది. ఈ శక్తులు అస్థిరంగా ఉంటాయి. ఎడమ చేతితో దానం చేయడం స్వార్థం లేదా అగౌరవాన్ని సూచిస్తుందట. ఇది కర్మ ప్రయోజనాలను తగ్గిస్తుందని, మరోవైపు, కుడి చేతితో దానం చేయడం కర్మను సమతుల్యం చేస్తుందని పండితులు చెబుతున్నారు.

Exit mobile version