Site icon HashtagU Telugu

Vastu: ఆలయ సమీపంలో ఇల్లు నిర్మించవచ్చా.. ఇంటిపై ధ్వజ స్తంభం నీడ పడితే ఏం జరుగుతుంది?

Temple Near Home

Temple Near Home

సాధారణంగా చాలామంది దేవాలయం చెట్టు నీడ కానీ ధ్వజస్తంభం నీడ కానీ ఇంటి మీద పడటం మంచిది కాదు అని అంటూ ఉంటారు. అలాగే దేవాలయానికి సమీపంలో కూడా ఇంటిని నిర్మించకూడదు అని చెబుతూ ఉంటారు. శాస్త్రం కూడా ద్వజ స్తంభం దేవాలయం నీడ పడే చోట ఇంటిని నిర్మించకూడదు అని చెబుతోంది. అయితే మరి దేవాలయం నీడ ఇంటి మీద పడితే ఏం జరుగుతుంది? దేవాలయానికి సమీపంలో ఎందుకు నిర్మించ కూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా మూడు రకాల దేవాలయాలు ఉన్నాయి.. అవి వైష్ణవ దేవాలయం, శైవ దేవాలయం, శక్తి దేవాలయం.

వాస్తు శాస్త్ర ప్రకారం దేవాలయం నీడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి పై పడకూడదు. ఒకవేళ ఆలయ నీడ ఇంటి పై పడితే ఐశ్వర్యం అడుగంటిపోతుంది. రోగాలు చుట్టుముడతాయి, ఆయువు క్షీణిస్తుంది. అసలు దేవాలయానికి ఎంత దూరం వరకు ఇంటి నిర్మాణం చేపట్ట కూడదు అన్న విషయానికొస్తే.. గృహ నిర్మాణం చేపట్టే యజమాని తన కుడిచేతిని ముందుకు చాచి ఎడమ భుజం చివరి భాగం వరకు ఒక హస్త ప్రమాణం తీసుకోవడాన్ని బార అంటాం. శివాలయం 100 బారల లోపు వరకు ఇంటిని నిర్మించకూడదు. ఎందుకంటే శివుడు ముక్కంటి, ప్రళయకారకడు. భక్తుడు పిలిస్తేనే పరిగెత్తే శివుడుమూడో కన్ను తెరిస్తే భస్మమే. అందుకే శివాలయానికి నూరు బారల లోపు ఇంటిని నిర్మించొద్దు.

అలాగే విష్ణు ఆలయానికి వెనక భాగంలో కూడా గృహ నిర్మాణం చేయరాదు. ఎందుకంటే విష్ణువు అలంకార ప్రియుడు. విష్ణువు సూర్య నారాయణుడి అవతారం అయినప్పటికీ సూర్యుడి వృత్తకార కిరణాలు సామ్య రూపములో ఎప్పుడూ నారాయణుడి శిరస్సు వెనక చక్రాకారంలో తిరుగుతూ ఉంటాయి. ఆ చక్రం వెనక భాగాన రాక్షసులతో యుద్ధంలో పాల్గొంటుంది. వైష్ణవ ఆలయానికి వెనుక 100 బారలు, ముందు 50 బారలు లేదా 20 బారలు అన్న వదిలేయాలి. అలాగే శక్తి ఆలయానికి కుడి, ఎడమ వైపులా గృహ నిర్మాణం చేపట్టొద్దు. అమ్మ చేతి రెండు వైపులా పదునైన ఆయుధం ఉంటుంది. అమ్మ రెండు చేతులతో శత్రు సంహారం చేస్తుంది. కాబట్టి శక్తి ఆలయానికి 120 బారల వరకు గృహ నిర్మాణం చేయరాదు. అలాగే ఆలయం ధ్వజస్తంభం మీద కూడా ఇంటి మీద పడకూడదు.

Exit mobile version