Site icon HashtagU Telugu

Shani Dev: పిల్లలపై శని ప్రభావం ఉండదా? పెద్దలు చెప్పిన విషయాలివే!

Shani Dev

Shani Dev

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో శని దేవుని ప్రభావం పడుతుంది. శని దేవుడు శుభ,అశుభ ఫలితాలను బట్టి అనుగ్రహించడం లేదంటే కష్టాలు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు. అనగా మంచి పనులు చేసే వారికి అష్టైశ్వర్యాలు అనుగ్రహం కలిగించి చెడు పనులు చేసే వారికి కష్టాలు పెడుతూ ఉంటారు. అయితే శని దేవుని ప్రభావం కేవలం పెద్దల పైన మాత్రమే ఉంటుంది పిల్లలపై ఉండదు అని అంటూ ఉంటారు. అయితే అలా చెప్పడం వెనుక పురాణ కథ ప్రచారంలో ఉంది.

మరి ఆ కథ ఏమిటో ఎందుకు పిల్లలపై శనిదేవుని ప్రభావం పడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కౌశిక మహర్షి కుమారుడు పిప్పలాదుడు. కౌశిక మహర్షి తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు. పిప్పలాదుడు తల్లిదండ్రుల ప్రేమకి దూరమై ఒక రావి చెట్టు నీడలో తలదాచుకుంటాడు. దాంతో ఆ చిన్నారికి పిప్పలాదుడు అనే పేరు కూడా వచ్చింది. పిప్పలాదుడుని చూసి జాలి పడిన నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశిస్తూ ఆ నామమే నీ జీవితానికి వెలుగు చూపిస్తుంది అని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

అప్పటినుంచి పిప్పలాదుడు ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు. తర్వాత అభినందించేందుకు వచ్చిన నారదుడిని బాల్యంలో తాను పడిన కష్టాలకు కారణం ఏంటి అని అడుగుతాడు పిప్పలాదుడు. అప్పుడు నారదుడు శనిప్రభావం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పడంతో తన తపోబలంతో గ్రహమండలం నుంచి శనిని కిందకు లాగి బాల్యంలో ఎవ్వరినీ వేధించవద్దని హెచ్చరించాడట పిప్పలాదుడు. అప్పుడు దేవతలు అందరు అక్కడకు వచ్చి పిప్పలాదుడికి నచ్చజెప్పడంతో శాంతించిన పిప్పలాదుడు తిరిగి శనిని గ్రహమండలంలో ప్రవేశపెడతాడు.

Exit mobile version