Vastu Tips: మంచంపై కూర్చొని భోజనం చేయకూడదా.. చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా భోజనం చేసేటప్పుడు పెద్దలు ఒకచోట కూర్చొని తినమని చెబుతూ ఉంటారు. అయితే పెద్దలు అలా

  • Written By:
  • Publish Date - February 9, 2023 / 06:00 AM IST

సాధారణంగా భోజనం చేసేటప్పుడు పెద్దలు ఒకచోట కూర్చొని తినమని చెబుతూ ఉంటారు. అయితే పెద్దలు అలా చెప్పడం వెనుక సైన్స్ తో పాటుగా ఆర్థిక పరిస్థితులు కూడా ఉన్నాయి. పెద్దలు మంచంపై కూర్చుని తినకూడదు అని చెబుతూ ఉంటారు. ఎంచక్కా నేలపై పద్మాసనం వేసుకుని కూర్చుని భోజనం చేయడం మంచిది అని చెబుతూ ఉంటారు. మరి మంచంపై కూర్చొని తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. అలాగె భోజనం ఎప్పుడు మంచి ప్రదేశంలోనే చేయాలి. వంట గదిలో కూర్చుని భోజనం చేయడం వల్ల రాహువును ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది.

అందుకే మనం భోజనం చేయడానికి వంటగది లేదా కొన్ని ప్రదేశాలు మంచిగా భావిస్తూ ఉంటారు. మరి మంచం మీద కూర్చొని ఎందుకు భోజనం చేయకూడదు అన్న విషయాన్ని వస్తే.. మనం తినే ఆహారానికి ఎప్పుడు గౌరవం ఇవ్వాలి. కానీ మనం మంచం మీద కూర్చుని తినడం వల్ల మంచం పడుకునే స్థలం కాబట్టి ఆహారాన్ని అవమానించినట్లు అవుతుంది. ఆహారాన్ని అవమానించడం అంటే లక్ష్మీదేవి అగౌరవపరిచినట్లే. తినడం అనేది బృహస్పతి, రాహువులకు సంబంధించినది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల రాహువుకు కోపం వచ్చి ఐశ్వర్యం తగ్గుతుంది. చాలామంది బాగా అలసిపోయి వచ్చినప్పుడు మంచం మీద అలాగే తినేసి పడుకుంటూ ఉంటారు..

అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి. మంచం మీద కూర్చున్నప్పుడు శరీరం భంగిమ కూడా సరిగా ఉండదు, దాని కారణంగా ఆహారం అవ్వడం కావడం కష్టం అవుతుంది..మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల మంచం మీద కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. దీని కారణంగా మీ నిద్రకు కూడా అంతరాయం కలుగుతుంది. మీరు భోజనం చేస్తున్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలను మంచంపై పడవేస్తే, అది మీ నిద్రకు భంగం కలిగించే క్రిములను మంచం మీదకు దారితీస్తుంది.