Wash Clothes: ‎రాత్రి సమయంలో బట్టలు ఉతకకూడదా.. ఉతికితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

‎Wash Clothes: రాత్రి సమయంలో బట్టలు నిజంగానే ఉతకకూడదా, ఉతికితే ఏం జరుగుతుంది. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Wash Clothes

Wash Clothes

Wash Clothes: రాత్రిళ్ళు కొన్ని రకాల పనులు చేయడం నిషేదించబడింది. అంటువంటి వాటిలో బట్టలు ఉతకడం కూడా ఒకటి. ఎందుకంటె సూర్యాస్తమయం తర్వాత దేవతల గమనం శాంతంగా మారుతుంది. ప్రతికూల శక్తుల ప్రవాహం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో గృహ సంబంధిత పనులలో రాత్రి సమయంలో బట్టలు ఉతకడం అశుభంగా పరిగణిస్తారట. ఎందుకంటే ఇది చేయడం వల్ల ఇంటిలోని సాత్వికత సానుకూల శక్తికి ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు.

‎రాత్రి సమయంలో చంద్రుని ప్రభావం పెరుగుతుందట. చంద్రుడు మనస్సు నీటికి కారకుడుగా పరిగణిస్తారు. నమ్మకాల ప్రకారం రాత్రి సమయంలో నీటికి సంబంధించిన పనులు ఎక్కువగా చేస్తే మానసిక అస్థిరత, ఆందోళన, అనవసరమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుందని, ఇది నమ్మకానికి సంబంధించినది అయినప్పటికీ, ఇది రుజువు చేయబడలేదు అని చెబుతున్నారు. రాత్రి సమయంలో బట్టలు ఉతికితే లక్ష్మీదేవి కూడా కోపం వస్తుందట. రాత్రి సమయంలో నీరు నింపడం, బట్టలు ఉతకడం ఆరబెట్టడం అసురక్షితం అని చెబుతున్నారు.

‎కొంతమంది మత పండితులు రాత్రి సమయంలో నీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చంద్ర దోషం, రాహు కేతువుల ప్రతికూల శక్తిని ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. బట్టలు రాత్రి సమయంలో ఉతకడం అశుభం, ఇలాంటి విషయాలను ఎవరూ పట్టించుకోకపోవచ్చు. కానీ మతపరమైన కోణం నుంచి దీని ప్రాముఖ్యత నేటికీ ఉందని చెబుతున్నారు. కాబట్టి రాత్రి సమయంలో బట్టలు ఉతక్క పోవడమే మంచిదని చెబుతున్నారు.

  Last Updated: 30 Nov 2025, 06:32 AM IST