Site icon HashtagU Telugu

Lord Ganesh: వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా?

Lord Ganesh

Lord Ganesh

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వినాయక చవితి సంబరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్క చోట ఇదే సంతోషం కనిపిస్తోంది. వినాయక చవితి నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇందులో మూడు రోజులు ముగిసిన విషయం తెలిసిందే. ఇంకా ఏడు రోజులపాటు గణనాథుల విగ్రహాలకు పూజలు జరగనున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే వినాయక చవితి వచ్చింది అంటే చాలు చాలామందికి గుర్తుకు వచ్చేది మొదటిది వినాయకుడు అయితే రెండవది ఉండ్రాళ్ళు. విగ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు అంటే ఎంతో ప్రీతికరం. ఆయనకు అవి భక్తితో సమర్పిస్తే చాలు తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుందని చెబుతూ ఉంటారు.

మిగతా రోజులతో పోల్చుకుంటే వినాయక చవితికి మాత్రమే ఈ ఉండ్రాళ్లను ఎక్కువగా విఘ్నేశ్వరుడికి సమర్పిస్తూ ఉంటారు. ఆయనకి జరిగే ఏ పూజలోనూ ఉండ్రాళ్ళు నైవేద్యం లేకుండా ఆ పూజ పూర్తవ్వదు. లడ్డూలు కూడా పెట్టినా ఉండ్రాళ్ళంటేనే గణపతికి ఎక్కువ ఇష్టం. అయితే మరి గణేశుడికి ఉండ్రాళ్ళు అంటే ఎందుకు అంత ఇష్టమో,దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకసారి అత్రి మహాముని,ఆయన భార్య అనసూయ పరమశివుడిని, ఆయన కుటుంబాన్ని భోజనానికి పిలిచారు. పరమశివుడు పార్వతి అమ్మవారు, చిన్నారి గణేషుడితో వారి ఇంటికి వెళ్ళారు. అందరికీ తెలిసినట్టు గణపతి ఆకలికి ఎక్కువసేపు ఆగలేడు. తన తల్లితో ఆకలేస్తోందని చాలా చెప్పాడు.

అందుకని భోజనం తయారవ్వగానే అనసూయ మొదట చిన్నారి గణేషుడికి వడ్డిస్తానని చెప్పారు. గణపతికి ఎంత ఆకలి వేసిందంటే అనసూయ పెడుతూనే పోయారు, గణపతి తింటూనే పోయాడు. అయినా ఆకలి మాత్రం తీరలేదు. ఆఖరిగా మాత అనసూయ తాను తయారుచేసిన తీపి వంటకాన్ని గుర్తుచేసుకున్నారు. దానికి చాలా లాభాలు ఉన్నాయి. వెంటనే అది తెచ్చి గణేషుడికి వడ్డించారు. ఇక గణపతికి తీపి వంటకాలంటే ఎలాగో ప్రీతి కాబట్టి వెంటనే రెండు చేతులతో ఒకేసారి తీసేసుకుని మింగేసారు. అందరినీ ఆశ్చర్యపర్చేవిధంగా, అతని కడుపు నిండిపోయి తర్వాత ఇంకేమీ అడగలేదు. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే గణేషుడే కాదు పరమశివుడు కూడా ఏం తినకపోయినా ఆకలి వేయట్లేదని చెప్పారు. ఈ కొత్తరకం వంటకం అద్భుతాలనే చేసింది. ఈ వంటకం ఏమిటా అని ఆశ్చర్యపోతూ పార్వతీదేవి అనసూయను ఎలా తయారుచేస్తారని అడిగారు. అప్పుడే అందరికీ తెలిసింది అవి ఉండ్రాళ్ళని, ఇవి గణపతికి చాలా ఇష్టమైన తీపి వంటకమని చెప్పిందట.

అయితే ఒకసారి పార్వతీదేవి కూడా ప్రత్యేక ఉండ్రాళ్ళను ఇద్దరు సోదరులు అయిన గణేషుడు,కార్తికేయుడికి తయారుచేసారు. ఆమె వారిద్దరికీ అది దైవసంభూతమైన ఉండ్రాయి అని, అందులో అమృతం ఉందని చెప్పారు. అది ఎవరైనా తింటే అన్ని కళలూ, సాహిత్యంలో నైపుణ్యం సాధిస్తారు. ఈ ఉండ్రాయి తినటం వలన ఆరోగ్య లాభాలు,మంచి రుచి కూడా దక్కుతుంది. ఇద్దరు సోదరులకి అది తినాలనిపించింది. కానీ పార్వతీదేవి అంత సులభంగా వారికి ఉండ్రాయిని ఇవ్వలేదు. ఎలా అయినా అది దైవ సంభూతమైన ఉండ్రాయి కదా మరి. ఆమె వారిద్దరికీ ఒక పోటీ పెడతానని చెప్పారు. అందులో వారిద్దరూ ప్రపంచం మొత్తం తిరిగిరావాలి. ఎవరైతే ముందుగా తిరిగివస్తారో వారికి ఉండ్రాయిలో పెద్ద భాగం దక్కుతుంది. ఇద్దరు అబ్బాయిలు పోటీకి తయారయ్యారు. ఆట మొదలవ్వగానే, కార్తికేయుడు తన వాహనం నెమలిపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి వెళ్ళిపోయాడు. కానీ గణేషుడికి అలాంటి వాహనం ఏమీ లేదు.

అతను వెంటనే, తండ్రి దగ్గరకి వెళ్ళి తనకో వాహనం కావాలని కోరాడు. అప్పుడే పోటీ సమానంగా ఉంటుంది. పరమశివుడు అతని కోరిక మన్నించి వాహనంగా ఎలుకను ఇచ్చాడు. కానీ ఎలుకపై కూర్చుని ప్రపంచం మొత్తం గణపతి ఎలా తిరగగలడు? అప్పుడే అతనికి అర్థమైంది, పిల్లల ప్రపంచం వారి తల్లిదండ్రులలో మాత్రమే ఉంటుంది. అందుకని వారిద్దరికీ వారే తన ప్రపంచం కావటం వలన వారికే ప్రదక్షిణం చేస్తానని చెప్పాడు. అలా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి తల్లిదండ్రుల మెప్పు పొందాడు. అలాగే తన తల్లి పార్వతీదేవి చేసిన ఉండ్రాలను కూడా ఆరగించాడు విగ్నేశ్వరుడు. ఇక అప్పటినుంచి విగ్నేశ్వరుని పూజలో ఉండ్రాళ్లని నైవేద్యంగా సమర్పించడం అన్నది జరుగుతూ వస్తోంది.