Site icon HashtagU Telugu

Vastu: ఇల్లు, షాపు ముఖద్వారాల దగ్గర నిమ్మకాయ, మిరపకాయ ఎందుకు కడతారో తెలుసా?

Lemon Disti

Lemon Disti

సాధారణంగా ఇంట్లో పెద్దలు కొన్ని కొన్ని సందర్భాలలో దిష్టి తగిలింది దిష్టి తీయాలి అని ఉప్పు మిరపకాయలు లాంటి వాటితో దిష్టితీస్తూ ఉంటారు. అలాగే ఇంటికి, మనం వ్యాపారం చేసే ప్రదేశాలలో ముఖద్వారం వద్ద నిమ్మకాయ మిరపకాయను కడుతూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు కడతారు అన్నది చాలామందికి తెలియదు. మరి కొంతమంది నరదృష్టి తగలకుండా ఉండటం కోసం అని అంటూ ఉంటారు. ఇది ఒక కారణమే అయినప్పటికీ సైన్స్ పరంగా కూడా ఒక కారణం దాగి ఉంది.

భారతీయులలో చాలామంది ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు. దారానికి నిమ్మకాయ మిరపకాయలు గూర్చి ఇంటి ముందు కడుతూ ఉంటారు. ఈ విధంగా నిమ్మకాయ, మిరపకాయల గుత్తిని వేలాడదీయడం వల్ల దృష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది అని కొందరు విశ్వసిస్తూ ఉంటారు. అయితే నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మందపాటి దారంలో నిమ్మకాయ, మిరపకాయలను గుచ్చడం వల్ల నిమ్మకాయ రసం నెమ్మదిగా ద్వారం ద్వారా మిరపకాయ లో చేరి ఆవిరి రూపంలో బయటకు వచ్చి గాలిలో విస్తరిస్తుంది.

అలా ఆ ఆవిరి గాలిలో కలిసినప్పుడు శ్వాసకోస ఇబ్బందులకు చెక్ పెడుతుంది. నిమ్మకాయ, మిరపకాయలు కలిపి ఇంట్లో గుమ్మానికో, దూలానికో కడితే పురుగులు కూడా రావు. నిమ్మకాయను దారానికి కట్టి గుచ్చడం వల్ల నిమ్మకాయలోని సిట్రస్ యాసిడ్ వాసన బయటకు వస్తు క్రిములు రాకుండా అడ్డుకుంటుంది మిరపకాయలోని ఘాటు కూడా పురుగులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అందుకే వాటిని గుమ్మానికి ఎదురుగా కడతారు.