Laughing Buddha Story : లాఫింగ్ బుద్ధ.. ఎన్ని మ్యాజిక్స్ చేస్తాడో తెలుసా ?

Laughing Buddha Story : లాఫింగ్ బుద్ధ.. దీన్ని ఇళ్లలో సక్రమమైన దిశలో పెట్టడం వల్ల సంతోషం వెల్లివిరుస్తుందని చాలామంది నమ్ముతారు.. అలాంటి లాఫింగ్ బుద్ధ విగ్రహం వెనుక పెద్ద కథే ఉంది.. అదేమిటి ? ఇంతకీ దాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టకూడదు ?  

  • Written By:
  • Updated On - June 24, 2023 / 02:55 PM IST

Laughing Buddha Story : లాఫింగ్ బుద్ధ.. 

దీన్ని ఇళ్లలో సక్రమమైన దిశలో పెట్టడం వల్ల సంతోషం వెల్లివిరుస్తుందని చాలామంది నమ్ముతారు.. 

ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

అలాంటి లాఫింగ్ బుద్ధ విగ్రహం వెనుక పెద్ద కథే ఉంది.. అదేమిటి ?

ఇంతకీ దాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టకూడదు ?  

లాఫింగ్ బుద్ధ (Laughing Buddha Story) చైనా జాతీయుడు.. అతడు  దాదాపు 1000 సంవత్సరాల క్రితం చైనాలో జీవించాడు.. అతడొక చాన్ సన్యాసి. లాఫింగ్ బుద్ధను పు-తాయ్ అని కూడా పిలుస్తారు. అతను చాలా దయాశీలి. లాఫింగ్ బుద్ధను చైనీయులు బోధిసత్వుని అవతారంగా భావిస్తారు. కాలక్రమంలో అతని బొమ్మను ఇంటిలో ఉంచే ట్రెండ్ మొదలైంది. అది అదృష్ట సూచకమని, శుభాలను కలిగిస్తుందనే విశ్వాసం చైనాలో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉంది.   

చిరునవ్వు

ప్రతి ఒక్కరికీ లాఫింగ్‌ బుద్దను చూడగానే మొహంలో చిరు నవ్వు అనేది వస్తుంది. దాన్ని ఒక్క నిమిషం చూసినా మనసు ప్రశాంతంగా అవ్వడంతో పాటు మానసిక ఒత్తిడి కూడా పోతుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

పాజిటివ్‌ ఎనర్జి

లాఫింగ్‌ బుద్దా .. నెగటివ్‌ ఎనర్జి కంటే పాజిటివ్‌ ఎనర్జిని ఎక్కువగా ఇస్తుందని, ఆ కారణంగా లాఫింగ్‌ బుద్ద ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోవచ్చని నమ్ముతారు. అయితే లాఫింగ్‌ బుద్దా విగ్రహా సొంతంగా కొనడం కంటే ఎవరైనా బహుమానంగా ఇస్తే బాగుంటుందని, దాంతోనే ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయని అంటారు.

మెటల్‌ లాఫింగ్ బుద్ధ

బోట్ పట్టుకున్న లాఫింగ్ బుద్ధ ఉంటే అది పెరుగుతున్న గౌరవం, కీర్తికి చిహ్నం.  మెటల్‌తో చేసిన లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచుకుంటే అది పని సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది ఇంటి నుంచి సోమరితనాన్ని కూడా నాశనం చేస్తుందని విశ్వసిస్తారు.

Also read : Ram Charan: మెగా ఇంటికి మహాలక్ష్మి.. బిడ్డ పేరుపై రామ్ చరణ్ క్లారిటీ

ఈ దిశలోనే లాఫింగ్ బుద్ధ  పెట్టండి

  • మీ ఇంటికి తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచాలి. తూర్పున ఉంచడం వల్ల ఇల్లు మొత్తం ఆనందం, సామరస్యాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది. ఇది వాదనలు మరియు అంతర్గత కలహాలను కూడా నిరోధిస్తుంది.
  • ఇంట్లో ఉండడం కొంచెం కష్టంగా అనిపిస్తే, ఇబ్బందులు కలుగుతుంటే లాఫింగ్ బుద్ధ దిక్కును సరిచూసి తూర్పు దిక్కులో ఉండేవిధంగా ఉంచితే సమస్యలు పరిష్కారమవుతాయి.
  • మీ కెరీర్ లేదా వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను పొందడానికి, మీ స్టడీ టేబుల్ లేదా ఆఫీస్ డెస్క్‌పై లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచండి. దీనివల్ల బిజినెస్ సక్రమంగా సాగుతుంది.
  • మీరు ఇంట్లో ఎన్నైనా లాఫింగ్ బుద్ధ విగ్రహాలను పెట్టుకోవచ్చు. కానీ ఎక్కడపడితే అక్కడ ఈ విగ్రహాలను పెట్టడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని వంటగది, బాత్రూమ్ లేదా టాయిలెట్‌ల సమీపంలో ఎప్పుడూ ఉంచకూడదు.    

బంగారు నాణేల సంచితో..

భుజంపై బంగారు నాణాల సంచిని మోస్తున్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీ కుటుంబ సభ్యులందరికీ ఆనందం మరియు అదృష్టాన్ని సూచిస్తుంది. మీరు మీ గదిలో బుద్దుడిని ఉంచడం ద్వారా ప్రతికూల శక్తులను కూడా నియంత్రించవచ్చు. విగ్రహం బంగారు రంగులో ఉంటే, అది చాలా సానుకూల వైబ్‌లను సృష్టిస్తుందని చెబుతున్నారు.

గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.