కార్తీకమాసం(Karthika Masam) అంటేనే చలికాలం(Winter) ప్రారంభం.. ఇంకా శివారాధన కార్తీక స్నానాలు చేయడం, శివ కేశవ పూజలు చేయడం వంటివి ఈ కార్తీకమాసంలో చేస్తారు. కార్తీకమాసంలో మహిళలు నోములు నోచుకోవడం, పూజలు చేయడం చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కృత్తిక నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే ఆ మాసాన్ని కార్తీకమాసంగా పిలుస్తారు. ఈ మాసంలో చంద్రుని(Moon) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు శక్తిశాలిగా ఉంటాడు.
ఈ కార్తీకమాసంలో నదులు, కాలువలు, చెరువులు, బావుల పైన చంద్రుని కిరణాలు పడతాయి ఈ విధంగా చంద్రుని కిరణాలు పడిన నీరు ఔషధాల నిలయంగా మారుతుంది. కావున రాత్రంతా చంద్రుని కిరణాలు పడిన ఆ నీటిని మనం వేకువజామున స్నానానికి వాడుకుంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు అని చెబుతారు. కౌముది అంటే వెన్నెల అని భావం. వెన్నెల పడిన నీటితో స్నానాలు చేయడం వలన మన మనసు ప్రశాంతంగా మరియు శరీరం ఉత్తేజంగా తయారవుతుంది. కావున ఈ మాసాన్ని కౌముది మాసం(Kaumudi Masam) అని అంటారు.
మనం రోజు ఉదయం చేసే స్నానాల సమయాన్ని బట్టి రుషి స్నానం, దేవ స్నానం, మనుష్య స్నానం, రాక్షస స్నానం అని పేర్లతో పిలుస్తారు. అలాగే కార్తీక మాసంలో వేకువ జామున చేసే స్నానాన్ని వెన్నెల స్నానం అని అంటారు. ఈ స్నానం చేయడం వలన మన మనసు ఆహ్లాదకరంగా మరియు మనకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా తగ్గుతాయని చెబుతారు. వెన్నెల స్నానాలు ఈ మాసంలో చేస్తాము కాబట్టి ఈ మాసాన్ని కౌముది మాసం అని అంటారు.