Site icon HashtagU Telugu

Deceased Persons Items: మరణించిన వ్యక్తి వస్తువులు ఉపయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Deceased Persons Items

Deceased Persons Items

మామూలుగా హిందువులు చనిపోయిన వారి విషయంలో, చావు విషయంలో అనేక రకాల విషయాలను పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది చనిపోయిన వ్యక్తికి సంబంధించిన బట్టలను,రగ్గులను,దుప్పట్లను స్మశానంలో పారేస్తూ ఉంటారు. మరికొందరు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా కాల్చేస్తూ ఉంటారు. అలాగే పునర్జన్మ ఉంటుంది అని చాలా బలంగా నమ్ముతారు. చనిపోయిన వ్యక్తి భౌతికంగా కనిపించకపోయినప్పటికీ అతడి ఆత్మ ఏదో ఒక రూపంలో ఇక్కడ తిరుగుతూ ఉంటుందని నమ్మకం. అలాగే మరణం ద్వారా ఆత్మ ఒక స్థితి నుంచి మరో స్థితికి పురోగమిస్తుందనేది హిందూ మత నమ్మకం. మరణించిన వ్యక్తి ఆత్మ మరొక శరీరాన్ని పొంది పునర్జన్మ తీసుకుంటుందని గట్టిగా నమ్ముతారు.

అందుకే చనిపోయిన వ్యక్తి దుస్తులను వేరొకరు ధరించకూడదనేది కూడా ఒక నియమం. మామూలుగా వృద్ధులు వయసు మీద పడిన వారు ఆరోగ్యం క్షీణించిన వారు మరణిస్తే అంత బాధ ఉండకపోవచ్చు కానీ, వయసులో ఉన్నవారు మనసుకు బాగా దగ్గరగా అనిపించిన వారు మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఇక వారి దుస్తులు ధరిస్తే ఈ బాధ మరింత పెరగవచ్చు. భరించలేనిదిగా మారవచ్చు. అది వారి ఉనికిని మరోసారి మనకు స్ఫురణకు తెచ్చి మనల్ని మరింత బాధించవచ్చు. మరుపుకు రాని వారి జ్ఞాపకాలు మరింత నిరాశకు, నిస్పృహకు కారణం కావచ్చు. అందుకని మరణించిన ప్రియమైన వారి దుస్తులు ధరించకూడదని శాస్త్రం చెబుతోంది. మరణించి పరలోకానికి చేరిన వారి దుస్తులు ఎప్పుడైనా సరే దానం చెయ్యడం మంచిది.

ఇలా దానం చెయ్యడం వల్ల మరణించిన వారి ఆత్మ పురోగమించడానికి, శాంతి పోందేందుకు అవకాశం ఉంటుంది. మరణించిన వారి దుస్తులు దానం చెయ్యడం వల్ల మరణించిన వారికి, వారి కుటుంబానికి ఆశీర్వాదాలు కూడా దొరకుతాయి. హిందూ ధర్మంలో దానం అనేది ఒక ధర్మం. అవసరం ఉన్న వారిని ఆదుకోవడానికి అదొక మార్గం. దాతృత్వానికి చాలా విలువ ఉంటుంది. కర్మను సాధించేందుకు చక్కని మార్గంగా పరిగణిస్తారు. ప్రియమైన వారి మరణానంతరం వారి దుస్తులను దానం చెయ్యడం వారి జ్ఞాపకానికిచ్చే గౌరవంగా చెప్పవచ్చు. అది మంచి పనిగా కూడా పరిగణలోకి వస్తుంది.

అంతేకాదు మరణించిన వ్యక్తిని తలచి తలచి బాధపడడం మానుకోవాలనేది కూడా శాస్త్రం చెబుతుంది. వారిని ఇక్కడ తలచే కొద్దీ వారి ఆత్మ ఘోషిస్తుందట. వారితో మనకు మాత్రమే కాదు వారికీ అనుబంధం ఉంటుంది. మనలను విడిచి వెళ్ళడం వారికి కూడా అత్యంత కష్టమైన విషయం. తిరిగితిరిగి తలచుకోవడం వారి వస్తువులు వాడుకోవడం, వారి దుస్తులు ధరించడం వారి ఆత్మకు సైతం ఇక్కడి నుంచి దూరంగా వెళ్లేందుకు ఇబ్బందిగా మారుతుంది. అది అంత మంచిది కాదు. వారి ప్రయాణం ముందుకు సాగి మరు జన్మవైపు వెళ్లిపోవాలనేది దీని వెనుకున్న మరో నిగూఢ రహస్యం. కనుక ఎంత ప్రియమైన వారి వస్తువులైనా, ఎంత ఖరీదైన దుస్తులైనా సరే అవి వారికి అత్యంత సన్నిహితులు, ఆప్తులు వాడుకోవడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది.