Site icon HashtagU Telugu

Vigneshwara : విఘ్నేశ్వరుడికి తొలి పూజ ఎందుకు చేస్తారు.. దాని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా?

Why Is The First Worship Done To Lord Vigneshwara.. Do You Know The Reason Behind It..

Why Is The First Worship Done To Lord Vigneshwara.. Do You Know The Reason Behind It..

హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా ముందుగా విఘ్నేశ్వరుడి (Vigneshwara)ని పూజిస్తూ ఉంటారు. చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరిగి పోవాలని ముందుగా విఘ్నేశ్వరుడి (Vigneshwara)ని పూజిస్తూ ఉంటారు. వినాయకుడు కష్టాల నుంచి ఆదుకుంటాడని, ఏ పని తలపెట్టినా అడ్డంకులు రాకుండా రక్షిస్తాడని భక్తులు నమ్ముతారు. ఏ పూజ చేసినా మొదటి పూజ గణేశుని (Vigneshwara)కే. అందుకే పెళ్లి శుభలేఖలు, సందర్భాన్ని బట్టి వేసే ప్రతి కార్డులపై మొదట గణపతి చిత్రాలను ముద్రిస్తారు. కాగా పురాణాల ప్రకారం ఒక కథ కూడా ఉంది.

We’re Now on WhatsApp. Click to Join.

పార్వతీ దేవి గణేశుని (Vigneshwara) ద్వారం వద్ద కాపలా ఉంచి ఎవరైనా వస్తే వారిని అడ్డుకోమని సూచిస్తుంది. వినాయకుడు ద్వారం వద్ద కాపలా ఉన్న సమయంలో శివుడు లోపలికి రావడానికి ప్రయత్నిస్తాడు. అయితే గణపతి లోనికి వెళ్లనివ్వలేదు. కోపం వచ్చిన శివుడు వినాయకుడి తలను వధించాడు. దాంతో గణేశుడు గట్టి గట్టిగా అరవడంతో ఆ కేకలు విన్న పార్వతీదేవి పరుగున వచ్చి అతని దయనీయ పరిస్థితిని చూసి కోపం తెచ్చుకుంటుంది. ఆ బాలుడుని తిరిగి పొందకపోతే ప్రపంచాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తుంది. పార్వతీదేవి ఆగ్రహాన్ని చూసి శివుడు ఏనుగు తలను మార్చి గణపతిని బ్రతికిస్తాడు.

అంతేకాదు గణేశుడిని పూజించకుండా ఎలాంటి పూజలు చేయకూడదని వరం ప్రసాదించాడు. శివుడు గణపతికి అపారమైన శక్తిని కూడా అనుగ్రహించాడు. యోగ విశ్వాసం ప్రకారం గణపతి మూలాధార చక్రాన్ని నియంత్రిస్తాడని చెబుతారు. ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఏదైనా పనులు ప్రారంభించే ముందు ఆయనను ప్రార్థిస్తారు. అలాగే ఏనుగు లాంటి తల, పెద్ద చెవి, పెద్ద పొట్ట ఉన్న ఏకైన దేవుడు గణేశుడు మాత్రమే. ఏనుగు తల జ్ఞానానికి సూచన. పెద్ద చెవిలో ఏది చెప్పినా కూడా ఆయన వింటాడని నమ్ముతారు. విఘ్నాలను తొలగించి కష్టాల నుంచి కాపాడే గణపతిని ప్రార్థించడం వల్ల జీవితంలోని దురదృష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

Also Read:  Heart Attack Cases: చలికాలంలో గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇవి చేయాల్సిందే..!