Ganesh Chaturthi: వినాయక చవితి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు మీకు తెలుసా?

త్వరలోనే వినాయక చవితి పండుగ రాబోతోంది. ఈ పండుగ కోసం దేశవ్యాప్తంగాఉన్న ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వినాయక చవితి

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 06:40 PM IST

త్వరలోనే వినాయక చవితి పండుగ రాబోతోంది. ఈ పండుగ కోసం దేశవ్యాప్తంగాఉన్న ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వినాయక చవితి పండుగ రోజు ఇంట్లో పెద్దలు చందమామను చూడొద్దు అని చెబుతూ ఉంటారు. ఆరోజున చందమామను చూడడం వల్ల లేనిపోని అపనిందలు వస్తాయని, ఆ ఏడాది మొత్తం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది అని చెబుతూ ఉంటారు. వినాయక చవితి పండుగ రోజు చందమామను ఎందుకు చూడకూడదు?ఒకవేళ చూస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే పురాణాల ప్రకారం విఘ్నేశ్వరుడి జననం వెనుక ఒక కథ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే..

ఆ కథను ఇప్పటికే ఎన్నోసార్లు విని ఉంటాం. పార్వతి దేవి స్నానం చేయడానికి వెళ్లగా అప్పుడు అక్కడ విగ్నేశ్వరుడిని కాపలాగా ఉండమని చెప్పి స్నానానికి వెళ్లగా ఇంతలోనే పరమేశ్వరుడు రావడంతో పార్వతి దేవిని చూడడానికి గణేశుడు లోపలికి శివుడిని అనుమతించదు. ఊగిపోయిన పరమశివుడు బాలుడి రూపంలో ఉన్న గణేశుని తలను ఖండించగా ఆ తర్వాత అక్కడికి వచ్చిన పార్వతీదేవి అది చూసి బోరున విలపిస్తుండడంతో పరమేశ్వరుడు ఏనుగు తలను నరికి తీసుకువచ్చి ఆ బాలుడికి పెట్టి ప్రాణం పోస్తాడు. అలా విఘ్నేశ్వరుడు అప్పుడు లేచి ఆడిపాడుతూ ఉంటాడు. అలా విగ్నేశ్వరుడికి ఏనుగు తలపెట్టిన తర్వాత అనంతరం కైలాసం చేరుకున్న గణనాథుడు తన పొట్టతో ఇబ్బందులు పడుతూ ఉంటాడు.

అదే సమయంలో వినాయకుని ఉదరం పగిలి అందులోని కుడుములు, ఉండ్రాళ్లు అన్నీ బయటకొచ్చి అచేతనుడిగా మారిపోతారు. ఈ సంగతి చూసిన పార్వతీ దేవి చంద్రుడు చూడటం వల్లే తన కుమారుడు అచేతనంగా మారిపోయాడన కాబట్టి తనను వినాయక చవితి రోజున చూసిన వారు నిందలు మోయాల్సి ఉంటుందని శాపం విధిస్తుంది. ఇక అప్పటి నుండి భాద్రపద శుద్ధ చవితి రోజున క్రిష్ణుడు ఆవు పాలను పితుకుతుండగా పాత్రల చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దీంతో తనకు కూడా కొన్ని నీలాపనిందలు వచ్చాయి. అది ఏకంగా సత్రాజిత్తుతో గొడవల దాకా వెళ్లింది.
హిందూ క్యాలెండర్ ప్రకారం, వినాయక చవితిని ఆరో మాసంలో జరుపుకుంటాం.

అంటే ఆగస్టు లేదా సెప్టెంబరు నెలలో ఈ పండుగ వస్తుంది. అయితే శుద్ధ చవితి ముందు రోజు, తర్వాతి రోజు చంద్రుడిని చూడకూడదు. ఎందుకంటే నాలుగో రోజైన చవితిని వ్రుద్ధి చెందుతున్న చంద్రకాలంగా పేర్కొంటారు. అదే సమయంలో భూమి, సూర్యుడు వేర్వేరు కోణాల్లో ఉంటారు. ఈ సమయంలో భూమిపై పడిన చంద్రకాంతి ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో మన ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది అని భారతీయులు వివరించారు.