Site icon HashtagU Telugu

Diwali 2024: దీపావళి పండుగ రోజు లక్ష్మి పూజ ఎందుకో తెలుసుకోవాలో తెలుసా?

Diwali 2024

Diwali 2024

హిందువులు జరుపుకునే అతి పెద్ద అలాగే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి కూడా ఒకటి. ఈ దీపావళి పండుగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున ఇంటిని మొత్తం దీపాలతో చక్కగా అలంకరించడంతో పాటుగా, నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు పిలుస్తూ సంతోషంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని పూజించడం అన్నది కామన్. మరి దీపావళి పండుగ రోజున కేవలం లక్ష్మీదేవిని మాత్రమే ఎందుకు పూజిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అలాగే దీపావళి రోజున లక్ష్మీదేవిని రాత్రి సమయంలో మాత్రమే పూజిస్తారు. అయితే దీపావళి పండగ సమయంలో మాత్రం లక్ష్మిపూజను రాత్రి సమయంలో మాత్రమే ఎందుకు చేస్తారో తెలుసా? ప్రతి సంవత్సరం దీపావళి రోజున, లక్ష్మీ దేవి పూజ ఎల్లప్పుడూ రాత్రి లేదా సూర్యాస్తమయం తర్వాత జరుపుకుంటారు. దీని వెనుక మతపరమైన, పౌరాణిక, జ్యోతిషశాస్త్ర కారణాలు ఉన్నాయి, ఇవి ఈ సంప్రదాయాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. ఇతర రోజులలో లక్ష్మీ దేవిని ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా పూజించవచ్చు.

అయితే దీపావళి రోజున మాత్రం సూర్యాస్తమం తర్వాత పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. రాత్రి సమయం లక్ష్మీదేవికి ఇష్టమైన సమయం. దీపావళి రోజున అమావాస్య తిధి. అంటే చంద్రుడు కనిపించడ చాలా చీకటిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దీపావళి రోజు రాత్రి సమయంలో ఇళ్లలో దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. లక్ష్మీదేవిని కాంతికి చిహ్నంగా భావిస్తారు. రాత్రి సమయంలో దీపం వెలిగించడం అంటే అజ్ఞానం తొలగి జ్ఞానంవైపు పయనం.. చీకటి నుంచి వెలుగుకి ప్రయాణం అనే సందేశాన్ని పంపుతుంది.