Head Cover: ప్రార్థన చేసే టైంలో తలపై వస్త్రం ఎందుకు ధరిస్తారు ? నిపుణుల విశ్లేషణ ఇదిగో..

దేవుణ్ణి ప్రార్ధించే టైంలో.. ఆలయంలో ఉన్న టైంలో భక్తులు తలపై వస్త్రం ధరించడాన్ని మనం చూస్తుంటాం.

  • Written By:
  • Publish Date - September 9, 2022 / 06:30 AM IST

దేవుణ్ణి ప్రార్ధించే టైంలో.. ఆలయంలో ఉన్న టైంలో భక్తులు తలపై వస్త్రం ధరించడాన్ని మనం చూస్తుంటాం. అలా ఎందుకు ధరిస్తారు ? తలపై వస్త్రం ధరించి పూజ/ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అనే సందేహం చాలామంది మదిలో మెదులుతుంటుంది. ఇలాంటి ఆధ్యాత్మిక సందేహాలకు mypandit సంస్థ సీఈవో , వ్యవస్థాపకుడు కల్పేశ్ షా చక్కటి విశ్లేషణతో కూడిన సమాధానాలు ఇచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* గరుడ పురాణం ప్రకారం..పూజ చేసేటప్పుడు తల భాగం తప్పనిసరిగా వస్త్రంతో కవర్ అయి ఉండాలి. తద్వారా మానసిక ప్రశాంతత, శ్రద్ధ రెండూ చేకూరుతాయి. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మన మైండ్ అదుపులో ఉండటానికి .. వేరే చోట్లకు అది గతి తప్పకుండా కంట్రోల్ చేయడానికి కూడా తలపై వస్త్రం ఉపయోగపడుతుంది. ప్రార్థనపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడానికి తలపై ఉండే వస్త్రం ఒక కవచంలా దోహదం చేస్తుంది.

* మనం పూజించే లేదా ప్రార్ధించే దేవుడికి కృతజ్ఞతతో, విశ్వాసం తో ఉన్నామనే సందేశాన్ని ఇచ్చే సూచికగానూ తలపై వస్త్రాన్ని ధరించి ప్రేయర్స్ చేస్తారు.

* ఆలయాలు, ప్రార్థన స్థలాల్లో ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. అక్కడికి వెళ్లినప్పుడు ఆ పరిసరాల్లో ఉండే స్పిరిచ్యువల్ పవర్ ను మన మెదడులోకి, ఆలోచనలలోకి పంపే ఏర్పాటే తలపై వస్త్రం. ఫలితంగా మెదడు చైతన్యమై .. తలపై ఉండే బ్రహ్మ రంధ్రాల ద్వారా మన ఆత్మశక్తికి ప్రేరణ లభిస్తుంది.

* కొన్ని మతాల మహిళలు పూజల సమయంలో బంగారు, వెండి అంచులు కలిగిన చీరలు ధరిస్తారు. పూజ సమయంలో ఈ అంచులను తలపై వచ్చేలా కవర్ చేసుకుంటారు. ఆధ్యాత్మిక శక్తిని చీరల అంచుల్లోని కొన్ని లోహాలు తమ వైపు లాగుతాయనేది దీని వెనుక ఉన్న పరమ ఉద్దేశం. అందుకే తలపై బ్రహ్మ రంధ్రాల భాగంలో కొందరు లేడీస్ కొంగు కప్పుకొని పూజలు చేస్తారు.

* మనం పూజ లేదా ప్రార్థన చేసేటప్పుడు మన దృష్టిని మరల్చేందుకు దుష్ట శక్తులు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. వాటి నుంచి మన మైండ్ కు రక్షణ కల్పించేందుకు.. ఫోకస్ అంతా దేవుడిపై పెట్టేందుకు తలపై వేసుకునే వస్త్రం దోహదపడుతుంది. ఇందుకే వివిధ మతాల ప్రార్థన కార్యక్రమాల్లో స్త్రీలతో పాటు పురుషులు కూడా తలపై వస్త్రం కప్పుకుంటారు.

* యజ్ఞ యాగాలు, హోమ పూజలు చేసేటప్పుడు వెలువడే వేడి మన శరీరం పై ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావాన్ని తగ్గించి.. శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ లో ఉంచేందుకు కూడా తలపై కప్పే వస్త్రం ఉపయోగపడుతుంది.

* సిక్కు పురుషులు, మహిళలు కూడా గురుద్వారాలోకి వెళ్ళేటప్పుడు తలపై వస్త్రం ధరిస్తారు. నెగెటివ్ శక్తి నుంచి మైండ్ కు రక్షణ కల్పించేందుకు ఇదొక ఏర్పాటు అని భావిస్తారు. మన శరీర శక్తి కేంద్రం తల మధ్య భాగం.. ఆ ప్రదేశాన్ని యాక్టివేషన్ లో ఉంచేందుకు తలపై ధరించే వస్త్రం ఉపయోగపడుతుంది.