మామూలుగా పూజ చేసేటప్పుడు దీపం వెలిగించడం అన్నది కామన్. అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు దీపం వెలిగించడానికి రకరకాల నూనెలను ఉపయోగిస్తూ ఉంటారు. ఒకొక్కరు ఒక్కొక్క విధమైన ఉపయోగించి దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే దీపారాధనకు మాత్రమే ఎక్కువ శాతం మంది నెయ్యిని ఉపయోగించాలని చెబుతూ ఉంటారు. కానీ నేను చాలా కాస్ట్లీ కావడంతో చాలామంది మామూలు నూనెలను ఉపయోగించి దీపారాధన చేస్తూ ఉంటారు. కాగా నెయ్యి అత్యంత పవిత్రమైనది.
ఆవు పాల నుండి నెయ్యిని తయారు చేస్తారు కాబట్టి నెయ్యి స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే ఆవు నెయ్యిలో తెలియని ఒక సువాసన కూడా ఉంటుంది. ఇది కాలిన ప్రదేశంలో చాలా కాలం పాటు దాని ఉనికిని నమోదు చేస్తుందని చెబుతున్నారు. ఇలా నెయ్యి దీపం వెలిగించడం వల్ల పూజ స్థలం పై పూజా ప్రభావం చాలా కాలం పాటు ఉంటుందట. కాగా మాములుగా మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయని నమ్ముతారు. నెయ్యి వల్ల వాటిలో శక్తి ప్రవహిస్తుంది. ఇంట్లో నెయ్యి దీపం వెలిగిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయట.
ఆవు పాలతో చేసిన నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ఇంట్లోకి క్రిములు ప్రవేశించవట. అలాగే నెయ్యి వాసన మొత్తం పర్యావరణాన్ని ప్రార్థనా స్థలంగా మారుస్తుంది. పూజించని వ్యక్తులు కూడా అందులో చేరతారట. నెయ్యి దీపం పెట్టడం వల్ల మీ ఇంట, బయట పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. నెయ్యిని పంచామృత స్వరూపంగా భావిస్తారు, అందుకే దీపం వెలిగిస్తారు. చాలామంది తెలియక గేదె నెయ్యని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ గేదె నెయ్యిని పూజల్లో అసలు వినియోగించకూడదట. కేవలం ఆవుపాలతో చేసిన నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు పండితులు.