పెళ్లి జరగాలి అంటే ప్రస్తుత రోజుల్లో పెళ్లి కార్డు అన్నది తప్పనిసరి. ఈ పెళ్లి పత్రికకు హిందూ మతంలోకి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ఇదివరకటి రోజుల్లో ఈ పెళ్లి పత్రిక లేకపోయినా ఇప్పుడు రకరకాల డిజైన్లు వారికి నచ్చినట్టుగా పెళ్లి పత్రికలను ప్రింట్ చేయించుకుంటూ ఉంటారు. అలా ప్రింట్ చేసిన పెళ్లి పత్రికలను మొదట విగ్నేశ్వరుని వద్ద పెట్టి పూజించి ఆ తర్వాత మొదటి శుభలేఖని వధువు తరుపున వారు వరుడుకి, వరుడు తరుపు వారు వధువుకి ఇస్తూ ఉంటారు. అలాగే కొంతమంది పెళ్లి పత్రికలపై దేవుళ్ళ ఫోటోలను కూడా ముద్రిస్తూ ఉంటారు.
ఎక్కువ శాతం మంది విఘ్నేశ్వరుని ఫోటోలు లేదంటే ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోని, రాముల వారి ఫోటోని ముద్రిస్తూ ఉంటారు. అయితే ఇందులో ఎక్కువ శాతం ఉంది గణేశుని ఫోటో ని పెళ్లి పత్రిక పై ప్రింట్ చేయిస్తూ ఉంటారు. మరి వెడ్డింగ్ కార్డు పై విగ్నేశ్వరుని బొమ్మను ప్రింట్ చేయించవచ్చా అలా చేస్తే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వెడ్డింగ్ కార్డును దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత మాత్రమే పంచుతారు. ముఖ్యంగా వినాయకుడి దగ్గర ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే పెళ్లి ఆహ్వాన పత్రిక విఘ్నేషుడి దగ్గర పెట్టడం వల్ల పెళ్లికి ఆటంకం కలగదని నమ్ముతారు. ఈ కారణంగానే చాలా మంది వెడ్డింగ్ కార్డు పై కూడా వినాయకుడి ఫోటోను పెడతారు.
అదేవిధంగా వాస్తు ప్రకారం వెడ్డింగ్ కార్డు పై వినాయకుడి ఫోటోను తయారు చేయడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రావని నమ్ముతారు. పూర్వకాలంలో వినాయకుడి ఫోటోను పెళ్లి పత్రికలో పెట్టేవారు కూడా. పూర్వకాలంలో గణేష చిత్రాన్ని కార్డును వేరు చేసే చోట పత్రికలో ఉంచేవారు. అదేవిధంగా పూర్వ కాలంలో ఇంట్లో వినాయకుడి చిత్ర పటాన్ని ప్రత్యేకంగా ఉంచి పూజించేవారు. అంటే అప్పట్లో కార్డులపై వినాయకుడి చిత్రాన్ని పెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు గణేశుడి ఫొటో కార్డుపై పక్కాగా పెట్టిస్తున్నారు. ప్రస్తుత కాలంలో పెళ్లి అయిపోగానే చాలా మంది కార్డులను పారేస్తుంటారు.
లేదా ఏదో ఒక చెట్టు కింద పెట్టేసి వస్తుంటారు. కానీ ఇలా చేయడం మీకు అస్సలు మంచిది కాదని పండితులు అంటున్నారు. ఎందుకంటే వెడ్డింగ్ కార్డుపై వినాయకుడి ఫోటో ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు వెడ్డింగ్ కార్డును పారేసినా లేదా చెట్టు కింద ఉంచినా వినాయకుడిని అవమానించినట్టే అవుతుంది. అందుకే వినాయకుడి ఫొటోను వెడ్డింగ్ కార్డుపై పెట్టకూడదు. బదులుగా వెడ్డింగ్ కార్డుపై శుభానికి చిహ్నంగా నెమలి ఈకల చిత్రాన్ని పెట్టించవచ్చని పండితులు చెబుతున్నారు.