Site icon HashtagU Telugu

Curd: పెరుగుతో అశుభాలు కూడా శుభాలు అవుతాయట.. అదెలా అంటే!

Mixcollage 15 Aug 2024 05 29 Pm 3340

Mixcollage 15 Aug 2024 05 29 Pm 3340

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పెరుగుకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో చాలా విలువ కూడా ఉంది. కేవలం పెరుగు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు పండితులు. ముఖ్యంగా రెండు మూడు స్పూన్ల పెరుగు అశుభాన్ని కూడా శుభంగా మారుస్తుందని చెబుతున్నారు. మీరు ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఒక స్పూన్ పెరుగు ఆ పనిలో విజయం సాధించవచ్చట. అలాగే మీరు చేసే ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వవట. ఎవరైనా సరే పని ప్రారంభించే సమయంలో లేదా ఎక్కడికైనా వెళ్లేటప్పుడు, ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు పెరుగుతో పంచదార కలిపి తినిపిస్తూ ఉంటారు.

భారతదేశంలోని గొప్ప మత సంప్రదాయాలలో, పురాతన కాలం నుంచి పెరుగును వివిధ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నార. ఇది స్వచ్ఛత, ఆరోగ్యం, శ్రేయస్సు కు చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే పూజల్లో పెరుగును వాడుతూ ఉంటారు. గ్రహాల శాంతి, సానుకూల శక్తిని పొందడానికి కూడా పెరుగును ఉపయోగిస్తారట. చాలాసార్లు దేవుళ్లకు అభిషేకం చేసే సమయంలోనూ పెరుగును వాడుతూ ఉంటారు. అలా పెరుగుతో అభిషేకం చేయడం వల్ల, ఆ దేవుడి అనుగ్రహం మనకు లభిస్తుందట. పెరుగుకు మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఉంది. పెరుగు భారతీయ సమాజంలో పవిత్రమైనది గా పరిగణిస్తారు. ఇది వివిధ మతపరమైన వేడుకలు , ఆచారాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు.

పెరుగును ప్రసాదంగా పంచే సంప్రదాయం కూడా ప్రబలంగా ఉంది. ఇది మతపరమైన ఆచారాలలో అంతర్భాగంగా చేస్తుందట. అలాగే చాలా రకాల శుభకార్యాల్లో పెరుగును ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా, వివాహం, గృహ ప్రవేశం వంటి ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు లేదా కొత్త ఉద్యోగం వంటి కొత్త పనిని ప్రారంభించే ముందు పెరుగును సేవించి ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. ఇది పెరుగు చక్కెర రూపంలో ఇస్తారు. ఇది స్వచ్ఛత , తీపిని సూచిస్తుంది. ఈ అలవాటును శుభ చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి ఏదైనా ప్రయాణానికి ముందు పెరుగు, చక్కెర తీసుకోవడం వల్ల ప్రయాణం శుభప్రదంగా, సురక్షితంగా ఉంటుందని నమ్ముతారు. ఇది భగవంతుని అనుగ్రహం పొందే మార్గంగా పరిగణిస్తారు.

ఇకపోతే గ్రహాల విషయానికి వస్తే పెరుగును చంద్రుడి మనసుతో పరిగణిస్తారరు. ఇది శాంతి,సౌమ్యత, మానసిక సమత్యులకు సంబంధించనది గా భావిస్తారు. ఇది శాంతి, సౌమ్యత, మానసిక సమతుల్యతకు సంబంధించినది. పెరుగు తినడం, దానం చేయడం చంద్రుని శాంతికి శుభప్రదంగా పరిగణిస్తారు. మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే, సోమవారం పెరుగు తినడం మీకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇది మనస్సుకు శాంతి, సమతుల్యతను అందిస్తుందట. అలాగే రాహు, కేతువు వంటి కొన్ని గ్రహ దోషాల అశుభ ప్రభావాలను తగ్గించడానికి కూడా పెరుగును ఉపయోగిస్తారు. రాహువు శాంతి కోసం, నల్ల నువ్వులు పెరుగు దానం చేయడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇది రాహువు అశుభ ప్రభావాలను తగ్గిస్తుందట. జీవితంలో శాంతి, స్థిరత్వాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు.

Exit mobile version